వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలా సాహెబ్ ఠాక్రే ఏం చెప్పారు, శివసేన ఏం చేస్తోంది, టైగర్ మాటంటే విలువలేదా?!

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాసన సభ ఎన్నికల ముందు బీజేపీ, శివసేన మైత్రీ కూటమి కాంగ్రెస్, ఎన్సీపీల మీద దుమ్మెత్తిపోశాయి. అయితే శివసేన నాయకులు ఈ రోజు చేస్తున్న పనికి ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రే (బాల్ ఠాక్రే) జీవించి ఉంటే శివసేన నాయకులు ఇలా ధైర్యాన్ని ప్రదిర్శించే వాళ్లా ? అంటున్నారు బీజేపీ కార్యకర్తలు. శివసేన నాయకులు ప్రవర్థిస్తున్న తీరుతో బాలా సాహెబ్ ఠాక్రే ఆత్మక్షోభిస్తుందని, తప్పకుండా శివసేన నాయకులు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. టైగర్ బాలా ఠాక్రే మాటంటే మీకు విలువ లేదా ? అని శివసేన నాయకులను బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

పేరుకే టీచర్, ఆ ముసుగులో కామేశ్వరి ఎన్ని అరాచకాలు, సోషల్ మీడియాలో ?!పేరుకే టీచర్, ఆ ముసుగులో కామేశ్వరి ఎన్ని అరాచకాలు, సోషల్ మీడియాలో ?!

నిన్న విలన్స్, నేడు హీరోలు

నిన్న విలన్స్, నేడు హీరోలు

ఇటీవల జరిగిన మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల మీద బీజేపీ, శివసేన నాయకులు దుమ్మెత్తి పోశారు. దేవేంద్ర ఫడ్నవీస్ మా సీఎం అభ్యర్థి అని బీజేపీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. అయితే శివసేన 50-50 ఫార్ములా తెరమీదకు తీసుకువచ్చిన శివసేన పార్టీ బీజేపీతో విడాకులు తీసుకుంది. నిన్న విలన్ లుగా కనిపించిన కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు నేడు శివసేనకు హీరోలు అయ్యారు.

బాలా ఠాక్రే ఏం చెప్పారంటే !

బాలా ఠాక్రే ఏం చెప్పారంటే !

శివసేన వ్యవస్థాపకుడు, మరాఠీల టైగర్ బాలా సాహెబ్ ఠాక్రే గతంలో కాంగ్రెస్ పార్టీలోని గాంధీ కుటుంబ సభ్యుల మీద విరుచుకుపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అలియాస్ ప్రియాంకా వాధ్రా, రాబర్ట్ వాధ్రాతో పాటు వీరి నమ్మిన బంటు అహమ్మద్ పటేల్ వలన భారతదేశానికి ఏం ప్రయోజనం అని బాలా సాహెబ్ ఠాక్రే ప్రశ్నించారు. సోనియా గాంధీ విదేశీ మహిళ, మనల్ని పాలించడానికి సిద్దం అయ్యారు, మీరు అందుకు అంగీకరిస్తారా ? అని శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రే ప్రజలను ప్రశ్నించిన విషయాన్ని నేడు బీజేపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.

సోనియా కాళ్ల మీద పడుతున్నారు !

సోనియా కాళ్ల మీద పడుతున్నారు !

కాంగ్రెస్ నాయకుల ఎలాంటి వారంటే, పార్టీలోని నిజాయితీ నాయకులను పక్కన పెట్టి ఇటలీ మహిళ సోనియా గాంధీకి పాదాభివందనాలు చేస్తున్నారని బాలా సాహెబ్ ఠాక్రే ఆరోపించారు. సోనియా గాంధీ కాళ్లు మొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నిస్సహాయత చూస్తుంటే జాలేస్తుందని బాలా సాహెబ్ ఠాక్రే బహిరంగంగా ఆరోపణలు చేసిన విషయాన్ని నేడు బీజేపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. సోనియా గాంధీ చెంచాల గురించి తన నోటీతో తాను చెప్పలేని బాలా సాహెబ్ ఠాక్రే ఎన్నోసార్లు వ్యంగంగా అన్నారని బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.

సీఎం కుర్చీ సమస్య కాదు !

సీఎం కుర్చీ సమస్య కాదు !

గతంలో బాలా సాహెబ్ ఠాక్రే ఓ ప్రైవేటు టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూను బీజేపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి అనే విషయం ముఖ్యం కాదు, మొదట మేము (బీజేపీ-శివసేన) ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి, ఏ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ పార్టీ నాయకుడే సీఎం కావాలి, అదే న్యాయం, అదే ధర్మం అని బాలా సాహెబ్ ఠాక్రే చెప్పిన విషయాన్ని శివసేన నాయకులు గుర్తు చేసుకోవాలని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

అఫ్జల్ ఖాన్ కీ ఔలద్

అఫ్జల్ ఖాన్ కీ ఔలద్

శాసన సభ ఎన్నికల ప్రచారం సమయంలో శివసేన నాయకులు కాంగ్రెస్, ఎన్సీపీ నేతల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిని అఫ్జల్ ఖాన్ కీ ఔలద్ అంటూ విమర్శించారు. ఇక శివసేన అధికార పత్రిక సామ్నాలో అయితే లెక్కలేనన్ని కథనాలతో కాంగ్రెస్, ఎన్సీపీలను విమర్శించారు. అదే పత్రికలో సోనియా గాంధీ, శరద్ పవార్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు.

అమిత్ షా అండ్ టీం

అమిత్ షా అండ్ టీం

మహారాష్ట్రలో శివసేనను అంతం చెయ్యాలని అమిత్ షా అండ్ గ్యాంగ్ ప్రయత్నాలు చేస్తోందని ఉద్దవ్ ఠాక్రే ఆరోపణలు చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఇంత కాలం బీజేపీ, శివసేన కలిసే పోరాటం చేశాయి. ఇప్పుడు అయోధ్య తీర్పు వచ్చిన తరువాత బీజేపీతో శివసేన తెగతెంపులు చేసుకుంది. శివసేన చేస్తున్న పని ఎంత వరకు న్యాయంగా ఉంది అని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

ఈ రోజు ఏం జరుగుతుందో ?

ఈ రోజు ఏం జరుగుతుందో ?

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని ఆ రాష్ట్ర గవర్నర్ శివసేనను ఆహ్వానించారు. మెజారిటీ శాసన సభ్యులు లేరని, మ్యాజిక్ ఫిగర్ కు తాము దూరంగా ఉన్నామని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి వెనకడుగు వేసింది. ఇదే సమయంలో శివసేన పార్టీ నాయకులు కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యారు. అయితే ఈ రోజు సాయంత్రం లోపు ఏం జరుగుతోందో అంటూ మరాఠీ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

English summary
Mumbai: Shivasene And NCP Possible Government Formation In Maharashtra: What Bal Thackeray Was Telling About Congress Leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X