• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీడియో: సంజయ్ రౌత్ ను పరామర్శించిన ఉద్ధవ్: ఇకో 48 గంటలు ఆసుపత్రిలోనే..!

|

ముంబై: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివసేన సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ ను ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే పరామర్శించారు. స్వల్పంగా గుండెపోటు రావడంతో సంజయ్ రౌత్ సోమవారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో 48 గంటల పాటు సంజయ్ రౌత్ తమ పరిశీలనలో ఉండాల్సి ఉంటుందని డాక్టర్లు వెల్లడించారు. ఈ క్రమంలో- ఉద్ధవ్ థాక్రే ఆయనను పరామర్శించారు. మంగళవారం ఆయన పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ జోషి, ఇతర నాయకులతో కలిసి లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. సంజయ్ రౌత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సౌకర్యాలపై డాక్టర్ల వద్ద ఆరా తీశారు.

క్లైమాక్స్ కు చేరిన మహా ఎపిసోడ్: అస్వస్థతకు గురైన సంజయ్ రౌత్: కంటిమీద కునుకు లేకుండా..ఆసుపత్రిలో

సంజయ్ రౌత్ అస్వస్థత పట్ల ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని, నిద్ర లేకుండా గడపటం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయని డాక్టర్లు వెల్లడించినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఆయనకు గుండెనొప్పి వచ్చినట్లు స్పష్టం చేశారు. విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరో రెండు రోజుల పాటు సంజయ్ రౌత్ ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని అన్నారు. సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరిన సమాచారాన్ని అందుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. స్వల్పంగా గుండెనొప్పి సంభవించినట్లు డాక్టర్లు వెల్లడించారని సంజయ్ రౌత్ సోదరుడు, విఖ్రోలి శాసనసభ్యుడు సునీల్ రౌత్ తెలిపారు.

Shiv Sena Chief Uddhav Thackeray meets Sanjay Raut at Lilavati Hospital in Mumbai

ఇదివరకే ఓ సారి గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారని, తాజాగా మరోసారి అదే పరిస్థితి తలెత్తిందని సునీల్ రౌత్ చెప్పారు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ మహారాష్ట్రలో రోజూ వినిపిస్తోన్న పేరు సంజయ్ రౌత్. మిత్రపక్షం భారతీయ జనతాపార్టీకి ప్రతిపాదించిన 50-50 ఫార్ములా ఆరంభం నుంచీ ఆయన పట్టువదల్లేదు. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలనే ఏకైక డిమాండ్ కు కట్టుబడిా ఉన్నారు. బీజేపీ తెగదెంపులకు దిగినప్పటికీ.. ఆయన వెనుకంజ వేయలేదు. బీజేపీ వైఖరిని ఎండగడుతూ శివసేన సొంత పత్రిక సామ్నాలో రోజూ వ్యాసాలు రాస్తూ వచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shiv Sena chief Uddhav Thackeray on Tuesday met party leader Sanjay Raut who was admitted to Lilavati Hospital yesterday after he complained of chest pain. Besides Uddhav, senior Sena leader and former Chief Minister of Maharashtra, Manohar Joshi, also met Raut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more