వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా ప్రభుత్వంలో శివసేన: గోవా సిఎం రేసులో ఇద్దరు

|
Google Oneindia TeluguNews

ముంబై: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు శివసేన అంగీకరించింది. శివసేనకు 8 మంత్రి పదవులు ఇచ్చేందుకు బిజెపి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. డిప్యూటీ సిఎం పదవికి బదులు కేంద్ర కేబినెట్‌లో ఒకరికి చోటు ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో శివసేన పార్లమెంటు సభ్యుడు అనిల్ దేశాయ్‌కి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు శివసేన ప్రభుత్వంలో చేరతానని పేర్కొనడంతో తెరపడింది. తమకు సరైన గౌరవం లభిస్తేనే ప్రభుత్వంలో ఉంటామని, లేదంటే ప్రతిపక్షంగా కొనసాగుతామని అంతకుముందు శివసేన హెచ్చరించిన విషయం తెలిసిందే.

గోవా సిఎం రేసులో ఇద్దరు నేతలు

Shiv Sena decided to join in MH Govt

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కబోతోందన్న వార్తల నేపథ్యంలో తదుపరి గోవా సిఎం ఎవరనే విషయం చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ విషయంపై చర్చించడానికి గురువారం స్థానిక బిజెపి నేతలు సమావేశమయ్యారు.

మనోహర్ పారికర్ బుధవారం ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలతో సమావేశమైన విషయం తెలిసిందే. దీంతో పారికర్ వారసులెవరన్న అంశంపై చర్చలు తీవ్రమయ్యాయి.
బిజెపి సీనియర్ నేత, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర అర్లేకర్‌లు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

లక్ష్మీకాంత్ పర్సేకర్ ఉత్తర గోవాలోని మాండ్రేమ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాజేంద్ర అర్లేకర్ పెర్నెమ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సీనియర్ నేతలు కావడం గమనార్హం.

English summary
Shiv Sena on Thursday decided to join in Maharashtra Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X