వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేమంతా కలిసే ఉన్నాము... పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై శివసేన క్లారిటి

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇరు పార్టీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు నిర్వహించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే సిద్దంగాపరంగా బద్దశత్రువులైన కాంగ్రెస్, శివసేనలు కలిసి పొత్తులు పెట్టుకోవడంపై శివసేన పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో వారు ఉద్దవ్ ఠాక్రేను కలిసి తమ అసంతృప్తిని వెళ్లగక్కాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను శివసేన నాయకుడు ఎక్తా షిండే కొట్టి పారేశారు.

Shiv Sena has dismissed the rumours of dissent within the party MLAs

ఇవి నిరాధారమైన వార్తలని చెప్పారు. ఇది కుట్రపూరితంగా జరుగుతున్న చర్యగా ఆయన అభివర్ణించారు. శివసేన చాల క్రమశిక్షణ కల్గిన పార్టీ అని, పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రేపై తమకు విశ్వాసం ఉందని షిండే స్పష్టం చేశారు.

మరోవైపు బీజేపీ సైతం అధికారాన్ని చేజిక్కుంచుకునేందుకు పావులు కదుపుతుంది. శివసేనను పక్కన బెట్టి ఎన్సీపీతో కలిసి అధికారాన్ని పంచుకునేందుకు ఆ పార్టీ నేత శరద్ పవార్‌తో కలిసి నేరుగా ప్రధాని నరేంద్రమోడీ సుమారు నలబై నిమిషాల పాటు మంతనాలు జరిపారు. అయితే అధికారం కోసం ఎలాంటీ చర్చలు జరగలేదని, కేవలం రైతుల నష్టపరిహారం గురించి మాత్రమే చర్చించామని శరద్ పవార్ చెప్పడం గమనార్హం.

English summary
Shiv Sena has dismissed the rumours of dissent within the party MLAs over their pending alliance with ideological opponents Congress and NCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X