వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమలేశ్ హంతకుల తల తీసుకొస్తే రూ.కోటి రివార్డు.. శివసేన నేత ప్రకటన

|
Google Oneindia TeluguNews

హిందూ సమాజ్ పార్టీ అధినేత కమలేశ్ తివారీని మట్టుబెట్టిన నిందితుల తల తీసుకొస్తే శివసేన నేత రివార్డు ప్రకటించారు. ముగ్గురి తల తీసుకొస్తే రూ.కోటి ఇస్తానని అరుణ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. హిందూ నేతను పట్టపగలు కార్యాలయంలో కాల్చి చంపడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.

అలానే చంపాలి

అలానే చంపాలి

కమలేశ్ తివారీని ఎలా చంపారో వారిని కూడా అలాగే చంపాలని అరుణ్ అన్నారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేయడంలో ఏం లాభం లేదని అరుణ్ అన్నారు. కమలేశ్ తరహాలోనే వారిని కూడా మట్టుబెట్టాలని చెప్పారు. వారి తలలు తీసుకొచ్చిన వారి కుటుంబాలకు రూ.కోటి నగదు ఇస్తానని ప్రకటించారు.

మాట్లాడితే అంతేనా

మాట్లాడితే అంతేనా

కమలేశ్ తివారీ హిందూ నేత.. ఆయనను హతమార్చడం ఏంటీ అని అరుణ్ ప్రశ్నించారు. హిందువుల తరఫున మాట్లాడేవారిని చంపేస్తారా అని మండిపడ్డారు. కానీ తమ దేశంలో అలాంటి పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. కమలేశ్ తివారీ హిందూ మహాసభ నేత, అయోధ్య భూ వివాదాస్పద స్థలంలో కక్షిదారుగా ఉన్నారు. అయోధ్య కేసు వాదనలు పూర్తయి తీర్పు వెలువరించే సమయంలో కమలేశ్ హత్యకు గురవడం కలకలం రేగుతుంది.

సిట్ ఏర్పాటు

సిట్ ఏర్పాటు

కమలేశ్ హత్య తర్వాత యూపీ సర్కార్ స్పెషల్ ఇన్వె్స్టిగేషన్ టీంను ఏర్పాటుచేసింది. ఇప్పటికే సూరత్‌లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మౌలానా మోసిన్ షేక్, ఖుర్షిద్ అహ్మద్, ఫైజాన్ అనే ముగ్గురు కమలేశ్‌ను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. 2015లో మహ్మద్ ప్రవక్తపై కమలేశ్ తివారీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కమలేశ్ హత్యకు గురయ్యారని యూపీ పోలీసులు బాస్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎలా జరిగిందంటే

ఎలా జరిగిందంటే

లక్నోలోని తన కార్యాలయంలో కమలేశ్ ఉండగా శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు కాషాయ వస్త్రాలు ధరించి లోపలికి వచ్చారు. రెండు స్వీట్ బాక్సులు తమ వెంట తీసుకొచ్చారు. అందుల్లోంచి తుపాకీ తీసి కాల్చారు. తర్వాత కత్తితో గొంతు కోశారు. దాదాపు 15 సార్లు కత్తితో పొడిచినట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాతే అక్కడినుంచి పారిపోయినట్టు విజువల్‌లో కనిపించింది. ఘటనాస్థలంలో పిస్టోల్, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని.. విచారణ చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు.

English summary
Shiv Sena leader has announced a reward of Rs 1 crore for beheading three people arrested for allegedly murdering Kamlesh Tiwari in Lucknow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X