వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసేన యూటర్న్.. రాజ్యసభలో వాకౌట్.. ప్రభుత్వానికి పరోక్ష మద్దతు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతిచ్చే అంశంపై శివసేన యూటర్న్‌ తీసుకుంది. లోక్‌సభలో పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపిన శివసేన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన వైఖరి మార్చుకుంది. బిల్లుకు వ్యతిరేకంగా శివసేన సభ్యులు ముగ్గురు కూడ వాకౌట్చేసి బయటకు వచ్చారు. దీంతో ప్రభుత్వానికి పరోక్ష మద్దతు ఇచ్చినట్టయింది.

రాజ్యసభ‌లో అమోదం పొందిన పౌరసత్వ బిల్లు..అనుకూలంగా 125, వ్యతిరేకంగా 105 ఓట్లు రాజ్యసభ‌లో అమోదం పొందిన పౌరసత్వ బిల్లు..అనుకూలంగా 125, వ్యతిరేకంగా 105 ఓట్లు

బీజేపీపై విమర్శలు గుప్పించిన శివసేన

బీజేపీపై విమర్శలు గుప్పించిన శివసేన

పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే...ఈ నేపథ్యంలోనే వాడివేడి చర్చలు జరిగాయి. అయితే ఈ బిల్లుపై లోక్‌సభలో మద్దతు తెలిపిన శివసేన రాజ్యసభలో మాత్రం షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సభలో బిల్లు ఓటింగ్‌కు వచ్చిన సంధర్భంలో జరిగిన చర్చలో పాల్గొన్న శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

వాకౌట్ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా

వాకౌట్ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా


మొత్తం మీద శివసేన పౌరసత్వ బిల్లుపై వ్యూహత్మకంగానే వ్యవహరించింది. ప్రభుత్వానికి పూర్తి మెజారిటి ఉన్న లోక్‌సభలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసింది. ఇక రాజ్యసభలో మాత్రం దూరంగా ఓటింగ్ ఉంది. రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారీటి లేకపోవడం తన బలాన్ని నిరూపించే అవకాశం రావడంతో ఓ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే...మరోవైపు ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు తెలిపింది. దీంతో ఓటింగ్ సమయంలో దూరంగా ఉండేందుకు బహిష్కరించి బయటకు వచ్చింది.

 హిందుత్వపై ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్న శివసేన

హిందుత్వపై ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్న శివసేన


పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలుపని వారిపై దేశద్రోహులనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. తమ జాతీయవాదానికి, హిందూత్వ వాదానికి ఎవరి సర్టిఫికేట్‌ అవసరం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సామర్థ్యాలపై తమకు నమ్మకం ఉందని చెప్పిన రౌత్‌.. ఈ బిల్లు పాస్‌ అయ్యాక.. చొరబాటుదారులను నియంత్రిస్తుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ శరణార్థులను అంగీకరిస్తే.. వారికి ఓటు హక్కు కల్పిస్తారా అని ప్రశ్నించారు.

 శివసేన తీరుపై విమర్శలు

శివసేన తీరుపై విమర్శలు

కాగా, శివసేన లోక్‌సభలో పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలుపడంపై కాంగ్రెస్‌ పార్టీ పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలోనే.. ఆ పార్టీ తన వైఖరిని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్ తోరట్‌ మాట్లాడుతూ.. శివసేన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో శివసేన భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కుదిరిన ఒప్పందాన్ని పాటించాలని తెలిపారు.

English summary
Shivasena members in Rajyasabha were not present in the house during the voting on the Citizenship Bill 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X