వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Video : మురుగునీటిలో కూర్చోబెట్టి-కాంట్రాక్టరుపై చెత్త వేయించిన ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ఓ శివసేన ఎమ్మెల్యే పారిశుద్ధ్య కాంట్రాక్టర్ పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. మురుగుతో నిండిన డ్రైనేజీలను క్లీన్ చేయించట్లేదన్న కారణంతో కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయాడు. కాంట్రాక్టర్‌ను మురుగు నీటిలో కూర్చోబెట్టి అతనిపై చెత్త వేయించాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే... ఇటీవలి వర్షాలకు ముంబైలో డ్రైనేజీలన్నీ పొంగి పొర్లుతున్నాయి. చాలాచోట్ల డ్రైనేజీ నీళ్లు రోడ్డు పైకి రావడంతో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో జనం రోడ్లపై నడిచే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే క్రమంలో శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే ముంబైలోని చాందివాలీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా చెత్తతో నిండిపోయిన ఓ నాలాను పరిశీలించారు.

shiv sena mla punished contractor garbage poured on him in mumbai

నాలాలో మురుగునీటి ప్రవాహానికి చెత్త అడ్డుగా పేరుకుపోవడంతో... ఆ నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. పారిశుద్ధ్య కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఎమ్మెల్యే దిలీప్ ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే ఆ కాంట్రాక్టర్‌ను పిలిపించి దానిపై ప్రశ్నించాడు. నిర్లక్ష్యానికి శిక్షగా రోడ్డుపై పారుతున్న మురుగు నీటిలో అతన్ని కూర్చోబెట్టాడు. అక్కడితో ఆగక.. పారిశుద్ధ్య కార్మికులతో అతనిపై చెత్త వేయించాడు.

ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. జరిగిన ఘటనపై ఆయన మాట్లాడుతూ...'సంజయ్ నగర్,సూరజ్ బాగ్ ప్రాంతాల వాసులు నాలాలో చెత్త వేస్తున్నారు. దీంతో నాలా పూర్తిగా చెత్తతో నిండిపోయి మురుగునీరు రోడ్డు పైకి వస్తోంది. దాన్ని క్లీన్ చేయించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌పై ఉంది. కానీ అతను ఆ పని చేయట్లేదు.బాధ్యత కలిగిన స్థానిక ప్రజాప్రతినిధిగా ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షించే బాధ్యత నాపై ఉంది.కాంట్రాక్టర్ తన పని సరిగా చేయలేదు కాబట్టే నేనిలా చేయాల్సి వచ్చింది.' అని చెప్పుకొచ్చారు.

మరోవైపు,ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మాట్లాడుతూ...'మున్సిపల్ కార్పోరేషన్‌లో అధికారంలో ఉన్నది ఎవరో అందరికీ తెలుసు. చెత్త వేయాల్సింది కాంట్రాక్టర్‌పై కాదు,శివసేన నేతలపై వేయాలి. బృహన్ ముంబై కార్పోరేషన్(బీఎంసీ)ను అవినీతిమయం చేశారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.' అని ఆరోపించారు.

English summary
Dilip Lande, the Shiv Sena MLA from Kandivali constituency in north Mumbai, reportedly made a contractor sit on a waterlogged road while garbage was thrown on top of him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X