వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ కమల భయం, శివసేన ఎమ్మెల్యే సీఎం ? రిసార్టు రాజకీయాలు, పవార్ షరతులు !

|
Google Oneindia TeluguNews

ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి డెడ్ లైన్ ఉండటంతో ఏం చెయ్యాలో అర్థంకాక ఇటు బీజేపీ, అటు శివసేన పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఆపరేషన్ కమల భయంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి శివసేన నాయకులు హోటల్, రిసార్టు రాజకీయాలకు తెరలేపారు. గురువారం గుట్టుచప్పుడు కాకుండా శివసేన ఎమ్మెల్యేలను కట్టుదిట్టమైన భద్రత ఉన్న హోటల్ కు తరలించారు.

లేడీ టీచర్ సెక్స్ పాఠాలు, బెడ్ రూంలో ప్రియుడు, అమ్మాయిలు, అబ్బాయిలు, వీడియోలు తీసి !లేడీ టీచర్ సెక్స్ పాఠాలు, బెడ్ రూంలో ప్రియుడు, అమ్మాయిలు, అబ్బాయిలు, వీడియోలు తీసి !

రాష్ట్రపతి పాలన ?

రాష్ట్రపతి పాలన ?

శుక్రవారం లోపు మహారాష్ట్రలో ఏదో ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యేల మద్దతుతో ఏ పార్టీ నాయకులు ముందుకు రాకపోవతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఆరు నెలల లోపు ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేకపోతే మహారాష్ట్రలో మళ్లీ శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.

రూ. కోట్లు ఆశ చూపుతున్న బీజేపీ ?

రూ. కోట్లు ఆశ చూపుతున్న బీజేపీ ?

తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల పేరుతో గాలం వేస్తున్నారని శివసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను వలలో వేసుకోవడానికి బీజేపీ నాయకులు రూ. కోట్ల రూపాయలు ఇవ్వడానికి వెనకడుగు వెయ్యడం లేదని. అయితే మా పార్టీ ఎమ్మెల్యేలను జారవిడుచుకోవడానికి తాము సిద్దంగా లేమని, ఎమ్మెల్యేలు జారిపోకుండా వారిని రక్షించుకుంటామని శివసేన అంటోంది.

బీజేపీ మాస్టర్ ప్లాన్ !

బీజేపీ మాస్టర్ ప్లాన్ !

మహారాష్ట్రలో శివసేన పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని బీజేపీ నాయకులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పసిగట్టిన శివసేన నాయకులు గురువారం తమ పార్టీ ఎమ్మెల్యేలను విలాసవంతమైన హోటల్ తో పాటు రిసార్టుకు తరలించారు. బీజేపీ నాయకుల ఆపరేషన్ కమల వలలో తమ పార్టీ ఎమ్మెల్యేలు పడకుండా శివసేన నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

శివసేనతో రాజీకి ఏక్ నిరంజన్

శివసేనతో రాజీకి ఏక్ నిరంజన్

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో వారి పట్టువీడటం లేదు. ముఖ్యమంత్రి కుర్చీ మాదంటే మాదే అంటూ ఇరు పార్టీల నాయకులు మొండిపట్టుతో ఉన్నారు. మరో వైపు మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీల మధ్య రాజీ చేసే సత్తా ఒక్క కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి మాత్రమే ఉందని, ఆయనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని శివసేన పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు అంటున్నారు.

 అలాగే చేస్తాం మిత్రమా !

అలాగే చేస్తాం మిత్రమా !

శివసేన నాయకుల వ్యాఖ్యలతో బీజేపీ హైకమాండ్ నితిన్ గడ్కరీని ముంబై పంపించింది. డెడ్ లైన్ కు ఇంకా ఒక్క రోజు గడువు ఉందని, ఆ లోపు శివసేన మద్దతుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, అందులో ఎలాంటి అనుమానం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు.

శరద్ పవార్ షరతులు !

శరద్ పవార్ షరతులు !

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎన్సీపీ పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ శివసేనకు కొన్ని షరతులు పెట్టారని తెలిసింది. బీజేపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని, కేంద్రంలోని ఎన్డీఏకి పూర్తిగా మద్దతు ఉపసంహరించుకోవాలని, కేంద్ర మంత్రిగా ఉన్న అరవింద్ సావంత్ (శివసేన) ఆయన పదవికి రాజీనామా చేసి బయటకు రావాలని, అప్పుడే తాము మద్దతు ఇస్తామని శరద్ పవార్ షరతులు విధించారని సమాచారం. అప్పుడే శివసేన నాయకుడు ముఖ్యమంత్రి కుర్చీలో కుర్చోవడానికి అవకాశం ఉంటుందని ఎన్సీపీ తేల్చి చెప్పడంతో శివసేన నాయకులు అయోమయంలో పడిపోయారని తెలిసింది.

English summary
Mumbai: Shiv Sena MLAs Moved To a Hotel near Mumbai in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X