వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికెన్, గుడ్డును వెజ్‌గా గుర్తించాలట.. శివసేన ఎంపీ వింత డిమాండ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కోడికూర, కోడిగుడ్డును విజిటేరియన్‌గా గుర్తించాలనే కొత్త డిమాండ్ వచ్చింది. ఇలా చేయమని కోరంది .. ఓ సాద సీదా పౌరుడు కాదు. ఎంపీ, అదీ కూడా పార్లమెంట్‌లో ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో కామెంట్లు పేలుతున్నాయి. చికెన్, ఎగ్ అయితే మరి మటన్, బీఫ్ ఏంటని సెటైర్లు వేస్తున్నారు. ఎంపీ డిమాండ్‌ను తప్పుపడుతూ కామెంట్లు పేలుతున్నాయి.

వింత డిమాండ్
శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రౌత్.. ఆ పార్టీ తరఫున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ నేతగా మంచి గుర్తింపు ఉంది. కానీ సోమవారం ఆయన సభలో చేసిన డిమాండ్ సర్వత్రా చర్చానీయాంశమైంది. చికెన్, ఎగ్‌ను వెజిటేరియన్‌గా గుర్తించాలని కోరారు. దీంతో సభలో ఉన్న సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆయుర్వేద, యోగ, న్యాచురోపతి, యునాని, సిద్దా, హోమియోపతి మంత్రిత్వ శాఖకు .. సంజయ్ విజ్ఞప్తి చేయడం చర్చకు దారితీసింది.

Shiv Sena MP wants chicken and eggs to be vegetarian. Classify beef as mushrooms, says internet

అంతేకాదు తన డిమాండ్‌కు గల కారణాన్ని కూడా వివరించారు సంజయ్. ఇదివరకు తాను నందూర్‌బర్ గ్రామానికి వెళ్లానిని గుర్తుచేశారు. అక్కడున్న ఆదీవాసీలు తమకు భోజనం పెట్టారని తెలిపారు. అయతే దానిని ఏంటని అడిగితే వారు ఆయుర్వేదిక్ చికెన్ అని చెప్పారని పేర్కొన్నారు. అంతేకాదు ఆ చికెన్ తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగైందన్నారు. అంతేకాదు ఆయుర్వేద కోడిగుడ్లపై చౌదరి చరణ్ సింగ్ వర్సిటీ పరిశోధకులు రీసెర్చ్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు బడ్జెట్‌లో వీటి కోసం నిధులు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ.10 వేల కోట్లు కేటాయిస్తే .. ఆయుర్వేద చికెన్, ఎగ్స్ ఉత్పత్తి మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంజయ్ డిమాండ్‌పై ట్వీట్టర్‌లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చికెన్, ఎగ్ ఓకే మరి బీఫ్, మస్రూమ్ సంగతేంటని ఒకరు .. మరి మటన్ సంగతేంటని మరొకరు.. ఇలా సెటైర్లు వేస్తున్నారు.

English summary
Sanjay Raut, the famous Shiv Sena leader and Rajya Sabha MP made quite an unusual demand on Monday. The minister urged the Rajya Sabha (Upper House) to consider chicken and eggs to be classified as vegetarian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X