వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా డ్రామా ఎఫెక్ట్: పార్లమెంట్‌లో మారిన శివసేన ఎంపీల సీట్లు, విపక్ష స్థానంలో..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కొనసాగిన అనిశ్చితితో బీజేపీ-శివసేన మధ్య బంధం తెగిపోయింది. ఆ రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఇవాళ జరిగే ఎన్డీఏ పక్ష సమావేశానికి కూడా హాజరుకాబోమని శివసేన తేల్చిచెప్పింది. కూటమి నుంచి బయటకొచ్చినట్టేనని.. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించాల్సి ఉందని తెలిపింది. దీంతో బీజేపీ కూడా ధీటుగానే స్పందిస్తోంది. ఎక్కడ, ఏ చిన్న అవకాశం వచ్చిన వదులుకోవడం లేదు.

శివసేన వర్సెస్ బీజేపీ

శివసేన వర్సెస్ బీజేపీ

మహారాష్ట్రలో శివసేన అలా వ్యవహరిస్తోండగా.. బీజేపీ కూడా అదేవిధంగా బీహెవ్ చేస్తోంది. పార్లమెంట్‌లో అధికార, విపక్షాల సీట్లలో స్వల్ప మార్పులు చేసింది. ఉభయ సభలు లోక్‌పసభ, రాజ్యసభలో సీట్లలో కొన్ని మార్పులు చేసింది. ఇప్పటివరకు తమతో ఉన్న శివసేనకు అధికార పక్షం వైపు సీట్లను కేటాయించింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో శివసేన సీట్లను విపక్షంలోకి మార్చింది. అలా కాదు విపక్షాలు ఆశీనులై ఐదో వరసలో వారికి సీట్లను కేటాయించింది.

105 అయితే 119 ఎలా

105 అయితే 119 ఎలా

మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ హార్స్ ట్రేడింగ్ పాల్పడుతుందని శివసేన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి బీజేపీకి 105 మంది సభ్యులు ఉన్నారు. కానీ తమకు 119 మంది సభ్యుల సపోర్ట్ ఉందని బీజేపీ నేతలు చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది. దీంతో రాష్ట్రపతి పాలనను అడ్డపెట్టుకుని అధికారం చేపట్టేందుకు బీజేపీ పావులు కదుపుతుందని శివసేన ఆరోపిస్తోంది.

మంత్రివర్గం నుంచి ఔట్

మంత్రివర్గం నుంచి ఔట్

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య అధికారం కోసం విభేదాలు తలెత్తడంతో.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఎంపీలు మంత్రి పదవీకి రాజీనామా చేశారు. తమ పార్టీ నిర్ణయం మేరకు రాజీనామా చేశామని అరవింద్ సావంత్ పేర్కొన్నారు. బీజేపీతో తమ బంధం తెగిపోయినట్టే శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. కానీ తాము అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉందని చెప్పారు.

సంకీర్ణ సంతకం

సంకీర్ణ సంతకం

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా మహారాష్ట్రలో తమ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని స్పష్టంచేశారు. శివసేనతో కలిసి కాంగ్రెస్, కూటమి జట్టుకట్టబోతున్నాయని వివరించారు. త్వరలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి.. ఐదేళ్లు పాలిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

English summary
seating arrangement of Shiv Sena MPs in both houses of Parliament have been changed. They will now sit in the fifth row on the opposition side, sources told to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X