వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై మేయర్ కుర్చీ తన్నుకుపోయిన శివసేన, కాంగ్రెస్ మద్దతు కోరిన బీజేపీకి అవమానం !

|
Google Oneindia TeluguNews

ముంబై: బృహత్ ముంబై మహానగర పాలికె (BMC)లో శివసేన పట్టు సాధించింది. ముంబై నగర మేయర్ కుర్చీలో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తన పార్టీ లేడీ కార్పొరేటర్ ను కుర్చోపెట్టారు. ముంబై కార్పోరేషన్ లో మేయర్ ఎన్నికలకు సరైన మెజారిటీ కార్పోరేటర్ల మద్దతు లేకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఎవ్వరూ పోటీ చెయ్యకపోవడంతో శివసేన సీనియర్ లేడీ కార్పోరేటర్లు కిశోరి పెడ్నేకర్ (56) మేయర్ గా, సుహాస్ వాడ్కర్ (44) ఉప మేయర్ గా నామినేషన్లు వేశారు. మేయర్, ఉప మేయర్ ఎన్నికలకు వీరిద్దరూ తప్పా ఎవ్వరూ పోటీ చెయ్యకపోవడంతో ఇక అధికారికంగా వీరి పేర్లు ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. అయితే మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు కోరిన బీజేపీకి అవమానం జరిగింది. బీజేపీకి తాము మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ తేల్చి చెప్పింది.

లవర్స్ షికార్లు, ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ చేయించిన ప్రియుడు, వీడియోలు, గర్భవతి !లవర్స్ షికార్లు, ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ చేయించిన ప్రియుడు, వీడియోలు, గర్భవతి !

అసలు పోటీనే లేదు

అసలు పోటీనే లేదు

నవంబర్ 22వ తేదీ ముంబై మేయర్, ఉప మేయర్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముంబై కార్పోరేషన్ లో 227 మంది కార్పోరేటర్లు ఉన్నారు. 7 మంది నవ నిర్మాణ సేన (MES) కార్పోరేటర్లు శివసేనలో చేరారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో 7 మంది శివసేన పార్టీ టిక్కెట్ తో విజయం సాధించడంతో శివసేన బలం 94కు చేరింది. బీజేపీకి 83 మంది కార్పోరేటర్లు, కాంగ్రెస్ కు 29 మంది, ఎన్సీపీకి 8 మంది, సమాజ్ వాది పార్టీకి 6 మంది, ఎంఎన్ఎస్ కు ఒక్కరు, ఏఐఎంఐఎం (ఎంఐఎం)కు ఇద్దరు కార్పోరేటర్లు ఉన్నారు.

రూ. 30 వేల కోట్ల బడ్జెట్, ఏషియాలో నెంబర్ వన్

రూ. 30 వేల కోట్ల బడ్జెట్, ఏషియాలో నెంబర్ వన్

ముంబై కార్పోరేషన్ లో ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో రూ. 30,000 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఏషియాలోనే అత్యంత స్థానిక శ్రీమంత సంస్థగా ముంబై కార్పోరేషన్ గుర్తింపు పొందింది. ముంబై మేయర్ కుర్చీ కోసం శివసేన, బీజేపీలో తీవ్రస్థాయిలో పోటీ జరిగింది. అయితే ముంబై మేయర్, ఉప మేయర్ కుర్చీలను శివసేన తన్నుకుపోయింది. ఉప మేయర్ కుర్చీని సైతం బీజేపీ దక్కించుకోలేకపోయింది.

23 ఏళ్లు శివసేన కింగ్

23 ఏళ్లు శివసేన కింగ్

1996 నుంచి ఇప్పటి వరకు శివసేన ముంబై మేయర్ కుర్చీని వేరే పార్టీకి దక్కకుండా చేసింది. అయితే 2017లో మాత్రం బీఎంసీలో సంపూర్ణ మెజారిటీ కార్పోరేటర్ల మద్దతు కూడగట్టడంలో శివసేన విఫలం అయ్యింది. 2017లో జరిగిన ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 114 కార్పోరేటర్లను గెలిపించుకోవడంలో శివసేన విఫలం అయ్యింది. 94 మంది కార్పోరేటర్లను గెలిపించుకున్న శివసేనకు బీజేపీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. బీజేపీ బయట నుంచి మద్దతు ఇవ్వడంతో శివసేన తన పార్టీ అభ్యర్థిని మేయర్ చేసింది.

శివసేనకు మా మద్దతు లేదు: కాంగ్రెస్

శివసేనకు మా మద్దతు లేదు: కాంగ్రెస్

ముంబై మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో తాము శివసేనకు మద్దతు ఇవ్వలేదని, తామకు మెజారిటీ కార్పోరేటర్ల మద్దతు లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చెయ్యలేదని, అందుకు తాము శివసేనకు మద్దతు ఇచ్చామని ఏలా అనుకుంటారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్పోరేటర్, బీఎంసీలో ప్రతిపక్ష నాయకుడు రవిరాజా ప్రతిపక్షాలను ప్రశ్నించారు. శివసేనకు బీజేపీ మద్దతు ఇచ్చిందా ? లేదా ? అనే విషయం మాకు అనవసరం అని రవిరాజా అన్నారు. బీఎంసీ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాకు మద్దతు ఇస్తే మేయర్ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని బీజేపీ మనవి చేసిందని, అయితే మేము తిరస్కరించామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్పోరేటర్ రవిరాజా చెప్పారు.

నిన్నటి నర్సు నేడు మేయర్

నిన్నటి నర్సు నేడు మేయర్

బీఎంసీ మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నామినేషన్లు సమర్పించడానికి చివరి రోజు ముగిసింది. ఇంత వరకూ శివసేన తప్పా ఏ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వెయ్యలేదు. అసలు పోటీ అనేది లేకపోవడంతో శివసేన పార్టీ సీనియర్ కార్పోరేటర్ కిశోరి పెడ్నేకర్ మేయర్ కుర్చీలో కుర్చోవడానికి సిద్దం అయ్యారు. 2002, 2012, 2017లో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో కిశోరి పెడ్నేకర్ కార్పోరేటర్ గా విజయం సాధించారు. వృత్తిరీత్య నర్సు అయిన కిశోరి ఫెడ్నేకర్ మేయర్ గా తన సత్తా చాటుకోవడానికి సిద్దం అయ్యారు. మహిళా మేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటానని కిశోరి ఫెడ్నేకర్ అంటున్నారు. ముంబై 77వ మేయర్ గా లేడీ కార్పోరేటర్ కిశోరి ఫెడ్నేకర్ భాద్యతలు స్వీకరించనున్నారు. 1931 నుంచి ముంబైలో కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి.

English summary
Shiv Sena to retain its control over Brihant Mumbai Municipal Corporation (BMC) as no party os willing to put their candidate in Mayor race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X