వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బురఖా బ్యాన్‌పై శివసేన యూటర్న్..

|
Google Oneindia TeluguNews

ముంబై : శ్రీలంక మారణహోమం నేపథ్యంలో భారత్‌లోనూ బురఖాలపై నిషేధం విధించాలన్న డిమాండ్‌పై శివసేన మాట మార్చింది. విపక్షాలతో పాటు మిత్రపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో యూటర్న్ తీసుకుంది. పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో వచ్చిన ఎడిటోరియల్‌తో శివసేనకు ఎలాంటి సంబంధంలేదని ప్రకటించింది. పత్రికలో ప్రచురితమైన ఆర్డికల్ ఎడిటర్ సొంత అభిప్రాయమని స్పష్టం చేసింది.

ఎన్డీఏలో బుర్ఖా చిచ్చు ? శ్రీలంక తరహా నిషేధం పై భిన్నస్వరాలుఎన్డీఏలో బుర్ఖా చిచ్చు ? శ్రీలంక తరహా నిషేధం పై భిన్నస్వరాలు

సామ్నాలో వచ్చిన ఎడిటోరియల్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో పార్టీ అధికార ప్రతినిధి నీలమ్ గోరే స్పందించారు. విధానపరమైన నిర్ణయాలన్నింటినీ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాతే పార్టీ ప్రెసిడెంట్ ఉద్దవ్ థాక్రే ప్రకటిస్తారమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సామ్నా గురువారం ఎడిషన్‌లో బురఖాలపై నిషేధం విధించే అంశంపై పార్టీలో చర్చ జరగలేదని, ఉద్ధవ్ థాక్రే దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. బురఖాలు బ్యాన్ చేయాలన్న డిమాండ్ సామ్నా ఎడిటర్ వ్యక్తిగత అభిప్రాయమే తప్ప దానితో పార్టీకిగానీ, అధ్యక్షుడికిగానీ ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పింది.

Shiv Senas U-Turn On Burqa Ban

ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందు బురఖాలను నిషేధించాలన్న శివసేన డిమాండ్ పెద్ద దుమారమే రేపింది. శివసేన వ్యాఖ్యలపై బీజేపీ సహా ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మెట్టుదిగొచ్చిన సేన బురఖాల విషయంలో యూటర్న్ తీసుకుంది.

English summary
Hours after its party mouthpieces called for a ban on the use of burqas like what Sri Lanka is considering, the Shiv Sena on Wednesday evening officially dissociated itself from the demand, following a massive furore on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X