వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూ మహాత్మా: సోనూసూద్‌పై శివసేన సెటైర్లు: సెలెబ్రిటీ ఈవెంట్ మేనేజర్‌ అంటూ

|
Google Oneindia TeluguNews

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోన్న వేళ.. జీవనోపాధిని కోల్పోయి వందలాది కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన బయలుదేరిన వలస కార్మికులకు రవాణా సదుపాయాన్ని కల్పించిన వ్యక్తి.. బాలీవుడ్ నటుడు సోనూసూద్. ప్రైవేటు బస్సులు, విమానాల ద్వారా ఆయన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించారు. దీని ఖర్చును ఆయన సొంతంగా భరించారు.

మందుబాబులకు కిక్కు ఎక్కించే న్యూస్: 70 శాతం స్పెషల్ ఫీజు తొలగింపు: ఎప్పటి నుంచి అంటే..?మందుబాబులకు కిక్కు ఎక్కించే న్యూస్: 70 శాతం స్పెషల్ ఫీజు తొలగింపు: ఎప్పటి నుంచి అంటే..?

సుమారు 50 కోట్ల రూపాయలను ఆయన వలస కార్మికుల కోసం ఖర్చు చేశారంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి. ముంబై జుహూ ప్రాంతంలోని తన ఆరు అంతస్తుల భవనాన్ని కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. సోనూసూద్ చేసిన మంచి పనులే ఆయనపై విమర్శలకు కారణమైంది. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించిన సోనూసూద్ ఇప్పుడు న్యూ మహాత్ముడిలా ఆవిర్భవించాడని శివసేన ఎద్దేవా చేస్తోంది. ముంబై మహానగరానికి సెలెబ్రిటీ ఈవెంట్ మేనేజర్‌గా తయారయ్యాడని చురకలు అంటిస్తోంది.

Shiv Sena Sparks Off Political Row With Dig at Actor Sonu Sood for Helping Migrants

దీనిపై శివసేన మౌత్‌పీస్ సామ్నా పత్రికలో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ఈ ఆర్టికల్‌ను శివసేన అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ రాశారు. సోనూసూద్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆయన ప్రధానమంత్రి కలుస్తారని, ముంబై సెలెబ్రిటీ మేనేజర్‌గా ఆవిర్భవిస్తారని చురకలు అంటించారు. వందలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించినందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆయనను మహాత్మ సూద్‌గా కితాబు ఇచ్చారని గుర్తు చేశారు.

కఠినమైన లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో సోనూసూద్‌కు ప్రైవేటు బస్సులు ఎక్కడినుంచి లభించాయని ప్రశ్నించారు. దీనిపై ఆరా తీయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలను తీసుకోలేకపోతోందని నిలదీశారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదా? అని పేర్కొన్నారు. సామ్నా పత్రిక ద్వారా సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. శివసేన వైఖరిని తూర్పారబడుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని పనిని ఓ సెలెబ్రిటీ చేశారని, దానికి అభినందించాల్సింది పోయి.. ఇలా తప్పు పట్టడం సరికాదంటూ మండిపడుతున్నారు. సోనూసూద్ చేసిన పనులను దేశం మొత్తం మెచ్చుకుంటోందని, శివసేన నాయకులు దాన్ని భరించలేకపోతున్నారని చెబుతున్నారు. సోనూసూద్ త్వరలో ప్రధానిని కలుస్తారంటూ ఆయనకు రాజకీయాలను అపాదించడం సరికాదనీ అన్నారు. తాను రాజకీయాల్లో చేరాలనుకోవట్లేదంటూ సోనూసూద్ ఇదివరకు స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

English summary
Not everyone is pleased with Sonu Sood. As the actor continues to rescue and send migrant workers home amid the lockdown, Shiv Sena has hit out against him, saying that Sood would "soon meet Prime Minister Narendra Modi and become the celebrity manager of Mumbai."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X