వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇటు డీకే, అటు ఆజాద్ : కాంగ్రెస్ నేతల అరెస్టుల పర్వం

|
Google Oneindia TeluguNews

ముంబై/ బెంగళూరు : కన్నడ నాట నెలకొన్న రాజకీయ అస్థిరత అరెస్టులతో అట్టుడుకుతుంది. ముంబై హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు డీకే శివకుమార్ ఆందోళన చేపట్టారు. అయితే వారు తమకు ప్రాణభయం ఉందని చెప్పడంతో పోలీసులు భారీగా మొహరించారు. ఆందోళన చేపడుతున్న శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టుల పర్వం ..
డీకే శివకుమార్‌తోపాటు మాజీ కేంద్రమంత్రి మిలింద్ దేవరా, మహారాష్ట్ర మాజీ మంత్రి నసీం ఖాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కలినా యూనివర్సిటీకి తరలించారు. ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటకలో అస్థిరత నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో వారితో మాట్లాడేందుకు డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. అయితే ఎమ్మెల్యేలు అంతకుముందే తమకు ప్రాణహాని ఉందని ముంబై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో హోటల్ వద్ద భారీగా పోలీసుల బలగాలను మొహరించారు. మరోవైపు ఎమ్మెల్యేలు కలిసేందుకు శివకుమార్ విఫలయత్నం చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Shivakumar detained after he refuses to leave Mumbai hotel, Ghulam Nabi Azad detained in Bengaluru

ఆజాద్ అరెస్ట్
మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ సీనియర్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతుంది. ఎమ్మెల్యేల రాజీనామాతో నెలకొన్న పరిస్థితులతో రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, కేపీసీసీ చీఫ్ దినేశ్ గుండురావు, ఇతర నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో వారిని రాజ్ భవన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ముంబైలో డీకే శివకుమార్, ఇటు బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేతల అరెస్ట్‌తో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. తమ వారిని కలిసేందుకు ప్రయత్నం చేస్తే అదుపులోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

English summary
Congress leader DK Shivakumar was detained by the Mumbai Police after he refused to move away from the Mumbai hotel where the rebel Karnataka MLAs are stationed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X