వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేవీలో మహిళలు ఉన్నారు..కానీ కాక్‌పిట్‌లో లేరు: నేవీ తొలి మహిళా పైలట్ శివాంగి

|
Google Oneindia TeluguNews

కొచ్చి: మహిళలు సమాజంలో పురుషులతో పాటు సమానంగా పోటీ పడుతున్నారు. ఏ రంగం చూసినా మహిళల ప్రాతినిథ్యం తప్పక కనిపిస్తుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ నుంచి దేశ సరిహద్దుల్లో పోరాడే సైనికుల వరకు మహిళల ప్రాతినిథ్యం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో స్తంభాలుగా ఉన్న కీలక పరిశ్రమల రంగాలను కూడా మహిళలు ఒంటిచేత్తో నడిపిస్తున్నారంటే మహిళా సాధికారికత ఏమేరకు ఉందో అర్థమవుతోంది. ఇప్పటి వరకు భారత వాయుసేనలో మహిళలు ఉన్నప్పటికీ వాయుసేనకు చెందిన విమానాలను నడిపేవారిలో మహిళలు లేకపోవడం విశేషం. అయితే ఆలోటును కూడా పూడుస్తూ తొలి మహిళా పైలట్ కాక్‌పిట్‌లోకి ఎక్కింది.

Recommended Video

News Roundup : Meet First Women Pilot Shivangi Singh | Sundar Pichai Now Also CEO Of Alphabet

సబ్‌ లెఫ్ట్‌నెంట్ శివాంగి ఇండియన్ నేవీలో తొలి మహిళా పైలట్‌గా చేరి రికార్డు సృష్టించారు. కేరళలోని కొచ్చిలో ఉన్న నేవల్ బేస్‌లో చేరారు. నేవీ డే కంటే రెండు రోజుల ముందర ఒక మహిళా పైలట్‌గా నేవీలో చేరి మహిళలకు స్ఫూర్తిగా నిలించారు. పైలట్ అవ్వడం తన కల అని దానిని నెరవేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు శివాంగి. తనకు తన తల్లిదండ్రులకు ఎంతో గర్వంగా ఉందని చెప్పిన శివాంగీ.. ఈ స్థాయికి చేరుకునేందుకు ఎంతో కాలంగా ఎదురు చూసినట్లు చెప్పుకొచ్చారు. మాటల్లో వర్ణించలేనని చెప్పిన శివాంగి... భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం మూడు దశలో ఉన్న శిక్షణను పూర్తి చేసుకోనున్నట్లు చెప్పారు.

Shivangi creates record by becoming the first woman to enter cockpit in Navy

భారత నేవీలో ఎంతో మంది మహిళలు ఉన్నారని ఇక్కడ మహిళలు పనిచేయడం కొత్తకాదని చెప్పిన శివాంగి... విమానంలోని కాక్‌పిట్‌లో ఒక మహిళ పనిచేయడం ఇదే తొలిసారని చెప్పారు. బీహార్‌లోని ముజాఫర్‌పూర్‌కు చెందిన శివాంగి డార్నియర్ సర్వేలియన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడుతపుతారు. ఇక తాను డిఫెన్స్ రంగంలో స్థిరపడటంతో తన చేరిక మరింత మంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. వారు తనకు మించి అంటే చాపర్లను, ఫైటర్లకు నాయకత్వం వహిస్తారని తాను ఆశిస్తునట్లు శివాంగి చెప్పారు. శివాంగి కంటే ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మహిలా పైలట్‌గా వింగ్ కమాండర్ ఎస్ ధామి ఈ ఏడాది ఆగష్టులో చేరారు.

English summary
Sub-Lieutenant Shivangi on Monday became the first women pilot in the Indian Navy as she joined operational duties at the naval base in Kerala’s Kochi.After earning her wings two days before the Navy Day on Wednesday, Shivangi said she was happy with her achievement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X