వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేము రెడీ: గవర్నర్ భగత్‌సింగ్‌ను కలవనున్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన ఎన్సీపీ కాంగ్రెస్‌లు ముందుకు రావడంతో ఆ మూడు పార్టీలు శనివారం రోజున గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలవనున్నారు. అయితే ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి గవర్నర్‌తో చర్చిస్తాయా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.గురువారం రోజున కామన్ మినిమమ్ ప్రోగ్రాం పై మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటు కూడా జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. శరద్ పవార్ కూడా ప్రభత్వం ఏర్పాటుపై సానుకూల సంకేతాలు పంపడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారో తెలుసా? సహేతుకమైన కారణాలివే..మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారో తెలుసా? సహేతుకమైన కారణాలివే..

ఇదిలా ఉంటే కాంగ్రెస్ శివసేనతో జతకట్టడంపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు పార్టీల సిద్దాంతాలు వేరుగా ఉంటుండగా ఒకేతాటిపైకి రావడం చాలామందిని ఆలోచింపజేస్తోంది. అయితే ప్రారంభంలో కాంగ్రెస్ శివసేనతో జతకట్టేందుకు ఆసక్తి చూపలేదు. ఇక ఆదివారం రోజున శరద్ పవార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఢిల్లీలో కలిసి ప్రస్తుత పరిస్థితులపై వివరించనున్నారు. శివసేన ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు సోనియాగాంధీ నిర్ణయం కీలకంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని చాలామంది కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని కోరడం విశేషం.

Shivasena-NCP-Congress to meet Governor today

Recommended Video

BJP MLC Somu Veerraju Fired On Chandrababu Naidu ! || చంద్రబాబు పై విరుచుకుపడ్డ సోము వీర్రాజు

ముఖ్యమంత్రి పదవి శివసేన పార్టీకే వెళుతుందని ఎన్సీపీ ప్రకటించింది. అయితే ఎన్సీపీ ప్రకటనపై కాంగ్రెస్ మౌనం వహించింది. ఎన్నికల్లో బీజేపీ శివసేన పొత్తుతో వెళ్లగా... ఎన్నికల తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను అమలు చేయాలని శివసేన పట్టుబట్టడంతో రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి. . ఆ తర్వాత ఎన్సీపీ కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకొచ్చింది శివసేన పార్టీ. ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే ముందుగా ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవాలని ఎన్సీపీ సూచించింది. దీంతో 30 ఏళ్ల మిత్రపక్షం ఎన్డీయేకు శివసేన గుడ్‌బై చెప్పి బయటకు వచ్చేసింది.

English summary
The Shiv Sena, NCP and Congress who have come together to form a government in the state will meet Maharashtra Governor Bhagat Singh Koshyari today. It is however not clear if the alliance would stake government formation claim or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X