వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..సింధియా వర్గంకు ప్రాధాన్యత

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఇందుకు మంగళవారం ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఇక తన కేబినెట్ విస్తరణ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ విస్తరణ

శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ విస్తరణ


మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జ్యోతిరాదిత్య సింధియా వర్గం వ్యతిరేక జెండా ఎగురవేయడంతో కమల్‌నాథ్ సర్కార్ కూలింది. దీంతో ఏడాదినర్ర కాకముందే తిరిగి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక కరోనా కష్టకాలంలో గద్దెనెక్కిన శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నీ తానై ప్రభుత్వాన్ని నడిపించారు. ఇక లాక్‌డౌన్ ఆంక్షలు తొలగించడంతో ఇక తిరిగి పాలనను గాడిలో పెట్టాలని భావించిన చౌహాన్... కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీనడ్డాతో పాటు ఇతర పెద్దలను కలిసి కేబినెట్ విస్తరణపై చర్చించారు. ఇక అమిత్ షా, చౌహాన్‌ల మధ్య చర్చలు ముగిసిన తర్వాత వీరిరువురు జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమైనట్లు సమాచారం. ఇక షా-నడ్డాతో భేటీ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రి పదవులకు పలువురు పేర్లను ముందుంచినట్లు సమాచారం.

 సెప్టెంబర్‌లోగా ఉపఎన్నికలు..?

సెప్టెంబర్‌లోగా ఉపఎన్నికలు..?


ఇక మధ్యప్రదేశ్‌కు వెళ్లేముందు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అవుతారని సమాచారం. మార్చి 23న తను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోడీని శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసిన దాఖలాలు లేవు. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు కేబినెట్ విస్తరణ చేయరాదని శివరాజ్ సింగ్ భావించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘట్టం కూడా పూర్తయ్యింది కనుక విస్తరణకు కూడా లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్‌లోగ ఖాళీగా ఉన్న 24 స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చడంలో సహకరించిన ఆ 24 మందిలో కేబినెట్‌లో మెజార్టీ వారికి స్థానం కల్పించాలని జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఒత్తిడి తీసుకొస్తోంది.

సింధియా వర్గం నుంచి 9 మందికి ఛాన్స్

సింధియా వర్గం నుంచి 9 మందికి ఛాన్స్


ప్రస్తుతం శివరాజ్ సింగ్‌తో పాటు మరో ఐదుగురు మాత్రమే మంత్రులుగా ఉన్నారు. వీరిలో నరోత్తం మిశ్రా, కమల్ పటేల్, మీనా సింగ్, తుల్సీ సిలావత్, గోవింద్ సింగ్‌లు ఉన్నారు. సిలావత్ మరియు రాజ్‌పుత్‌లు సిందియా వర్గం వారు. వీరు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా శివరాజ్ సింగ్‌పై మంత్రి పదవి కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకవేళ వారిక దక్కకుంటే వారు పార్టీని వీడే అవకాశం ఉందని భావించినందునే కేబినెట్ విస్తరణ చేయడంలో జాప్యం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఇక శివరాజ్ సింగ్ కేబినెట్‌లోకి సింధియా వర్గం నుంచి కనీసం 9 మందికి స్థానం దక్కుతుందని సమాచారం. వీరితో పాటు మరో 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా స్థానం దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ అనారోగ్యంతో ఉండటంతో ఆరాష్ట్ర ఇంఛార్జ్ గవర్నర్‌గా ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

English summary
Madhya Pradesh CM Shivraj Singh Chouhan gets a green signal from BJP high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X