వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీది నియంతృత్వ ధోరణి, హిట్లర్ అని శివసేన ఫైర్, హోటల్లో ఎమ్మెల్యేలతో ఆదిత్య థాకరే భేటీ..

|
Google Oneindia TeluguNews

ఎముకలు కొరికే చలిలో కూడా మహారాష్ట్ర రాజకీయాలు హీట్ పుట్టిస్తోన్నాయి. నిమిష నిమిషానికి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీపై శివసేన నిప్పులు చెరిగింది. బీజేపీ పార్టీ నియంత హిట్లర్‌ను తలపిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.

బానిసలం కాదు..

బానిసలం కాదు..

ఢిల్లీకి మహారాష్ట్ర ఎప్పటికీ బానిస కాబోదని శివసేన తేల్చిచెప్పింది. మహారాష్ట్రకు బీజేపీ సీఎం అభ్యర్థి అవసరం లేదని తన పత్రిక సామ్రాలో విమర్శలు గుప్పించింది. అంతేకాదు అపద్దర్మ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపేందుకు సుముఖంగా లేమని స్పష్టంచేసింది. తాము ఫడ్నవీస్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేమనే అంశానే వారి ఓటమికి నిదర్శనంగా అభివర్ణించింది.

మోడీ నోట..

మోడీ నోట..

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోడీ, దేవేంద్ర ఫడ్నవీస్‌ను అభినందించారు. మెజార్టీ సీట్లు సాధించారు, తిరిగి అధికార చేపట్టబోతున్నారని పేర్కొన్నారు. కానీ ఫలితాలు వెలువడి నేటికి 15 రోజులైంది. మరి ప్రభుత్వ ఏర్పాటు సంగతేంటి అని ప్రశ్నించారు. నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంలో ఆంతర్యం ఏంటీ అని ప్రశ్రించింది.

దూర.. దూరంగా షా..

దూర.. దూరంగా షా..

బీజేపీ చీఫ్ అమిత్ షా మహారాష్ట్ర రాజకీయాల్లో కల్పించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా అని దుయ్యబట్టింది. అంతేకాదు మహారాష్ట్రలో ఏర్పడితే మైనార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పారు. ఫడ్నవీస్ సీఎం అయితే వెనక ఉండేది శివసేన అని తెగేసి చెప్పింది. తామే చక్రం తిప్పుతామని తేల్చిచెప్పింది.

ఉద్దవ్ మాట

ఉద్దవ్ మాట

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని శివసేన అధినేత ఉద్దవ్ నిర్ణయిస్తారని ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే శరద్ పవార్ పేరు సీఎం పదవీ కోసం వినిపిస్తోంది. తాము బీజేపీ అభ్యర్థి కన్నా పవార్ సీఎం అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తామని తెలిపింది. బీజేపీకి సపోర్ట్ చేయబోమని.. ఒకవేళ చేసినా అదీ ముణ్ణాళ్ల ముచ్చటగానే ఉంటుందనే సిగ్నల్స్ ఇచ్చింది.

ఎమ్మెల్యేలతో ఆదిత్య

ఎమ్మెల్యేలతో ఆదిత్య

మహారాష్ట్రలో రాజకీయాలు పీక్‌కి చేరడంతో రీ ట్రీట్ హోటళ్లో తమ ఎమ్మెల్యేలతో ఆదిత్య థాకరే సమావేశమయ్యారు. తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి మలాద్‌లోని రిసార్ట్‌కు ఆదిత్య థాకరే వచ్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఎమ్మెల్యేలకు ప్రలోభాల పర్వం కొనసాగిస్తారనే ఊహాగానాలతో శివసేన తమ ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

English summary
Shiv Sena compared the BJP to the infamous German authoritarian ruler Adolf Hitler and claimed that "Maharashtra was not a slave of Delhi"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X