వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసేనపై మరో వ్యాఖ్య: సానియాను లాగిన శోభా డే

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: కాలమిస్టు శోభా డేకు, శివసేన నేతలకు మధ్య ప్రారంభమైన వివాదం మరింత ముదురుతోంది. తాజాగా, శోభా డే వివాదంలోకి హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను లాగారు. ముస్లింల ఓటింగ్ హక్కును రద్దు చేయాలని శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనపై దాడికి శోభా డే సానియా మీర్జా చారిత్రక విజయాన్ని ప్రస్తావించారు.

టెన్నిస్ డబుల్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారత మహిళగా సానియా మీర్జా చరిత్రకెక్కింది. డబ్ల్యుటిఎ ఫ్యామిలీ సర్కిల్ కప్‌ను సానియా మార్టినా హింగిస్‌తో కలిసి గెలుచుకుంది. సానియా మీర్జా విజయాన్ని ట్విట్టర్‌లో ప్రశంసిస్తూ ఆమె ఓటు వేయవచ్చునని శోభా డే అన ్నారు.

ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకోవడాన్ని నిరోధించడానికి ముస్లింల ఓటు హక్కును రద్దు చేయాలని రౌత్ శివసేన అధికారిక పత్రిక సామ్నాలో రాశారు.

మహారాష్ట్రలోని మల్టీఫ్లెక్స్‌ల్లో తప్పనిసరిగా మరాఠీ చిత్రాలను ప్రదర్శించాలనే ఆదేశాలపై శివసేనకు, శోభా డేకు మధ్య వివాదం ప్రారంభమైంది. మరాఠీ ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని ఆరోపిస్తూ శివసేన శోభాడేపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.

Shobhaa De takes on Shiv Sena, tweets ‘hope Sania can vote’

ఈ నేపథ్యంలో శోభా డే నివాసం వద్ద ముంబై పోలీసులు భద్రతను పెంచారు. రౌత్ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి శోభా డే సానియా మీర్జా చిత్రాలను పోస్టు చేసి ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు.

English summary
The war of words between Shiv Sena and columnist Shobhaa De seems to be getting murkier by the day. Continuing her rant against Sena, the writer-columnist used Sania Mirza’s historic achievement to attack leader Sanjay Raut who has stirred a controversy by saying that the voting rights of Muslims should be scrapped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X