Shock: అక్కా అంటూ వెంట తిరిగాడు, 17 ఏళ్ల అమ్మాయిని తల్లిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి, షాక్ లో ఫ్యామిలీ !
చెన్నై/తంజావూర్: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న అమ్మాయి, అబ్బాయి చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్నారు. అమ్మాయికి 17 ఏళ్లు, అబ్బాయికి 12 సంవత్సరాలు. ఇద్దరు కలిసి తిరుగుతుంటే ఎవ్వరికి ఏమాత్రం అనుమానం రాలేదు. అబ్బాయి 7వ తరగతి చదువుతున్నాడు. అమ్మాయి వెంట అక్కాఅక్కా అంటూ ఆ అబ్బాయి చనువుగా ఉంటున్నాడు. ఇటీవల అమ్మాయికి ఎక్కువ కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లారు. అమ్మాయికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్బవతి అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన రెండు రోజులకు ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో మైనర్ అమ్మాయిని గర్బవతిని చేసింది ఆదే ఏరియాలో నివాసం ఉంటున్న 12 ఏళ్ల అబ్బాయి అని వెలుగు చూడటం కలకలం రేపింది. మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆమెను తల్లి చేసిన కేసులో అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారని ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రచురించింది.

ఒకే ఏరియాలో అమ్మాయి, అబ్బాయి
తమిళనాడులోని తంజావూరులో ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న అమ్మాయి, అబ్బాయి చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్నారు. అమ్మాయికి 17 ఏళ్లు, అబ్బాయికి 12 సంవత్సరాలు. ఇద్దరు కలిసి తిరుగుతుంటే ఎవ్వరికి ఏమాత్రం అనుమానం రాలేదు. అబ్బాయి 7వ తరగతి చదువుతున్నాడు.

బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
అమ్మాయి వెంట అక్కాఅక్కా అంటూ ఆ అబ్బాయి చనువుగా ఉంటున్నాడు. ఇటీవల అమ్మాయికి ఎక్కువ కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లారు. అమ్మాయికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్బవతి అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

ఫ్యామిలీకి, పోలీసులకు షాక్ మీద షాక్
ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన రెండు రోజులకు ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మాయిని ఎవరు గర్బవతిని చేశారు అంటూ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. అమ్మాయి కోలుకున్న తరువాత ఆమెను కుటుంబ సభ్యులు మంచితనంతో మాట్లాడి వివరాలు బయటకులాగారు.

అబ్బాయి తండ్రి అయ్యాడా ?
ఇదే సమయంలో మైనర్ అమ్మాయిని గర్బవతిని చేసింది ఆదే ఏరియాలో నివాసం ఉంటున్న 12 ఏళ్ల అబ్బాయి అని వెలుగు చూడటం కలకలం రేపింది. మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆమెను తల్లి చేసిన కేసులో అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారని ప్రముఖ జాతీయ మీడియా ఐఏఎన్ ఎస్ ఏజెన్సీ కథనం ప్రచురించింది. అయితే 12 ఏళ్ల అబ్బాయి అమ్మాయిని రేప్ చెయ్యడం సాధ్యం అవుతుందా, ఆ అబ్బాయి ఆమెను నిజంగా తల్లిని చేశాడా ?, ఇది సాధ్యం అవుతుందా అంటూ క్షుణ్ణంగా దర్యాప్తు చూస్తున్నామని తంజావూరు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.