Shock: భార్య వదినతో ?, భార్య అన్న కూతురు ఎస్కేప్, ఫ్యామిలీ పేర్లు మొత్తం రాసి ఏం చేశాడంటే !
బెంగళూరు/ కలబురిగి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భార్య కుటుంబ సభ్యులకు, భర్తకు చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. భార్య అన్న భార్యతో దంపతులకు మాటపట్టింపులు ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో భార్య అన్న కూతురు మాయం అయ్యింది. మా కూతురు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి మా సోదరి భర్త కారణం అని భార్య అన్న పోలీసు కేసు పెట్టారు. పోలీసులు భర్తను పిలుచుకుని వెళ్లి చితకబాదేశారు. రెండు రోజుల తరువాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన భర్త నా ఆత్మహత్యకు నా భార్య అన్న వదినలు కారణం అని డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Illegal affair: పెళ్లికి ముందే ఆంటీతో అక్రమ సంబంధం, కొడుకు ముందే భార్యను చంపేసి !

దంపతులు హ్యాపీలైఫ్
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని శహబాద్ తాలుకాలోని మరతూర ప్రాంతంలో మంజునాథ్ అలియాస్ మనోజ్ సిందే (32) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రతిభా అనే మహిళను మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలు మనోజ్, ప్రతిభా దంపతులు సంతోషంగా జీవించారు. తరువాత టార్చర్ మొదలైయ్యింది.

భార్య ఫ్యామిలీ తో గొడవలు
పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత మనోజ్ కు అతని భార్య ప్రతిభా కుటుంబ సభ్యులతో గొడవలు మొదలైనాయి. ప్రతిభాకు సాయిబన్న అనే అన్న ఉన్నాడు. సాయిబన్నా, శరణమ్మ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఇటీవల సాయిబన్నా, శరణమ్మ దంపతుల కూతురు ఆమె ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిసింది.

పోలీసు కేసు పెట్టిన భార్య ఫ్యామిలీ
మా కూతురు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి మా సోదరి ప్రతిభా భర్త మనోజ్ కారణం అని భార్య అన్న సాయిబన్నా, శరణమ్మ దంపతులు పోలీసు కేసు పెట్టారు. పోలీసులు ప్రతిభా భర్త మనోజ్ పోలీస్ స్టేషన్ కు పిలిపించుకున్నారు. రెండు రోజులు పోలీసులు మనోజ్ ను పోలీస్ స్టేషన్ లోనే చితకబాదేశారు. రెండు రోజుల తరువాత మనోజ్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆవేదనతో రగిలిపోయాడు.

ఫ్యామిలీలో అందరిపేర్లు రాసి ఆత్మహత్య
తనను అనవసరంగా పోలీస్ స్టేషన్ కు పిలిపించి కొట్టించారని, తన ఫ్యామిలీకి అవమానం జరిగిందని మనోజ్ కుమిలిపోయాడు. నా ఆత్మహత్యకు నా భార్య ప్రతిభా అన్న సాయిబన్నా, అతని భార్య శరణమ్మ, ప్రతిభా తల్లి కారణం అని డెత్ నోట్ రాసిన మనోజ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న అతని భార్య ప్రతిభాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పరారైనారు.