Shock: కాలేజ్ అమ్మాయిల దెబ్బకు చర్చి ఫాస్టర్ మీద కేసు నమోదు, ఆ టైమ్ లో ? !
చెన్నై/ నాగర్ కోవిల్: కాలేజ్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ చర్చి ఫాస్టర్ మీద కేసు నమోదు అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోవిల్ లో సీఎస్ఐ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో ఒక కాలేజ్ నిర్వహిస్తున్నారు. నాగర్ కోవిల్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ఈ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నారు. కాలేజ్ లో చదువుతున్న ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కు సంబంధించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు కాలేజ్ సమీపంలోని రెస్టారెంట్ కు వెళ్లి కొంత సమయం ఎంజాయ్ చేసి తరువాత ఇంటికి వెలుతున్నారు. ఎప్పటిలాగే అమ్మాయిలు, అబ్బాయిలు రెస్టారెంట్ కు వెళ్లి వాళ్లకు కావలసిన తినుబండారాలు తీసుకుని వాళ్ల టేబుల్స్ మీద కుర్చున్నారు. ఆ సందర్బంలో పక్క టేబుల్ లో చర్చి ఫాస్టర్ శ్యాముయల్ కుర్చున్నారు

కాలేజ్ అమ్మాయిలతో మాట్లాడిన చర్చి ఫాదర్ శ్యాముయల్ వారితో అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తరువాత ఓ అమ్మాయి చెయ్యి శుభ్రం చేసుకోవడానికి వాష్ బేషిన్ దగ్గరకు వెళ్లడంతో అక్కడికి వెళ్లిన చర్చి ఫాస్టర్ శ్యాముయల్ మద్యం మత్తులో ఆ అమ్మాయి ఫోన్ నెంబర్లు అడిగాడని, ఆమెను లాడ్జ్ కు రావాలని పిలిచాడని సాటి విద్యార్థులు ఆరోపించారు.
ఆ సమయంలో విద్యార్థులు ఎదురు తిరగడంతో చర్చి ఫాస్టర్ శ్యాముయల్ ఆయన కారులో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కొందరు కాలేజ్ అబ్బాయిలు బైక్ లో వెంబడించి మార్గం మద్యలో చర్చి ఫాస్టర్ శ్యాముయల్ కారు అడ్డగించారు. తరువాత చర్చి ఫాస్టర్ శ్యాముయల్ కారు అద్దాలు ద్వంసం చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చర్చి ఫాస్టర్ కారులో పారిపోతున్న సమయంలో బైక్ ల్లో వెంబడించిన విద్యార్థులు వారి మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు.
విషయం తెలుసుకున్న నాగర్ కోవిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాలేజ్ విద్యార్థులను నచ్చచెప్పి చర్చి ఫాస్ట్ ర్ శ్యాముయల్ ను పోలీసు భద్రతతో అక్కడి నుంచి పంపించారు. లేజ్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ చర్చి ఫాస్టర్ శ్యాముయల్ మీద కేసు నమోదు అయ్యింది. కేసు నమోదు చేసిన నాగర్ కోవిల్ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.