వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lawyer: జిల్లా కోర్టులో లాయర్ ను కాల్చి చంపేశారు. రివాల్వర్ అక్కడే వదిలేసి ఎస్కేప్, మాజీ సీఎం ఫైర్ !

|
Google Oneindia TeluguNews

లక్నో/షాజహాన్ పూర్: జిల్లా కోర్టులో కేసు వాయిదాలకు హాజరుకావడానికి ప్రజలు హాజరైనారు. కేసులు వాదించడానికి, తమ కక్షిదారులు కేసు విచారణకు హాజరుకాలేదని కేసులు వాయిదాలు అడగడానికి లాయర్లు హడావిడిగా తిరుగుతున్నారు. ఎవరిపనుల్లో వారు బిజీగా ఉన్నారు. కేసు వాయిదాలకు నిందితులను పిలుచుకుని పోలీసులు ఆ కోర్టుకు వచ్చారు. ఇలా సామాన్య ప్రజలు, కొందరు రాజకీయ నాయకులు, లాయర్లు, పోలీసు అధికారులు బిజీబిజీగా ఉన్నారు. జిల్లా కోర్టు మూడు అంతస్తులో తుపాకి కాల్పులు వినపడ్డాయి. మూడో అంతస్తులో ఉన్న ఓ న్యాయవాది హత్యకు గురైనాడని వెలుగు చూడటం కోర్టు ఆవరణంలో కలకలం రేపింది. లాయర్ ను హత్య చేసిన నిందితులు అతన్ని హత్య చెయ్యడానికి ఉపయోగించిన పిస్తోల్ అక్కడే వదిలేశారు. లాయర్ ను చంపిన హంతకులు అక్కడి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయా ?, అసలు ప్రభుత్వం ఉందా ? అంటూ మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏకిపారేయడం హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: ప్రియుడితో ఎస్కేప్, కజిన్ తో కాపురం, లిక్కర్ పార్టీతో చంపేసిన ఇద్దరు ప్రియులు!Illegal affair: ప్రియుడితో ఎస్కేప్, కజిన్ తో కాపురం, లిక్కర్ పార్టీతో చంపేసిన ఇద్దరు ప్రియులు!

కోర్టులో అందరూ బిజీబిజీ

కోర్టులో అందరూ బిజీబిజీ

ఉత్తరప్రదేశ్ లోని షహజహాన్ జిల్లా కోర్టులో సోమవారం (అక్టోబర్ 18వ తేది) ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. షహజహాన్ జిల్లా కోర్టులో కేసు వాయిదాలకు హాజరుకావడానికి ఆ జిల్లాలోని కేసులకు హాజరౌతున్న ప్రజలు హాజరైనారు. కేసులు వాదించడానికి, తమ కక్షిదారులు కేసు విచారణకు హాజరుకాలేదని కేసులు వాయిదాలు అడగడానికి లాయర్లు కోర్టు చుట్టూ హడావిడిగా తిరుగుతున్నారు.

మూడో అంతస్తులో లాయర్ దారుణ హత్య

మూడో అంతస్తులో లాయర్ దారుణ హత్య


షహజహాన్ జిల్లా కోర్టు మూడో అంతస్తులో న్యాయవాది భూపేంద్ర సింగ్ ఉన్నాడు. లాయర్ భూపేంద్ర సింగ్ తో సోమవారం ఆయనతో కేసులు వాదించుకుంటున్న కొంతమంది కలిశారు. షహజహాన్ జిల్లా కోర్టు మూడు అంతస్తులో తుపాకి కాల్పులు వినపడ్డాయి. మూడో అంతస్తులో ఉన్న న్యాయవాది భూపేంద్ర సింగ్ హత్యకు గురైనాడని వెలుగు చూడటం జిల్లా కోర్టు ఆవరణంలో కలకలం రేపింది.

 పోలీసు అధికారులు అక్కడే ఉన్నారు, కాని ?

పోలీసు అధికారులు అక్కడే ఉన్నారు, కాని ?


లాయర్ భూపేంద్ర సింగ్ హత్యకు గురైన సమయంలో జిల్లా కోర్టు ఆవరణంలో పోలీసు అధికారులు ఉన్నారు. లాయర్ భూపేంద్ర సింగ్ ను హత్య చేసిన నిందితులు అతన్ని హత్య చెయ్యడానికి ఉపయోగించిన పిస్తోల్ అక్కడే వదిలేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. లాయర్ భూపేంద్ర సింగ్ ను చంపిన హంతకులు అక్కడి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది.

 ఒక్కరు కూడా చూడలేదు.... సాక్షం చెప్పలేదు

ఒక్కరు కూడా చూడలేదు.... సాక్షం చెప్పలేదు


కోర్టు ఆవరణంలో తాము కేసు విచారణకు హాజరుకావడానికి వచ్చామని, లాయర్ భూపేంద్ర సింగ్ ను హత్య చేసిన సమయంలో మేము హంతకులను చూడలేదని పోలీసు అధికారులు అంటున్నారు. గతంలో బ్యాంకులో ఉద్యోగం చేసిన భూపేంద్ర సింగ్ గత నాలుగు సంవత్సరాల నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.

 ప్రభుత్వం ఉందా ? లేదా, మాజీ సీఎం ఫైర్

ప్రభుత్వం ఉందా ? లేదా, మాజీ సీఎం ఫైర్

భూపేంద్ర సింగ్ వాదిస్తున్న కేసుల్లోని ప్రత్యర్థులు అతన్ని హత్య చేసిన ఉంటారని అందరూ అనుమనాం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అసలు ప్రభుత్వం ఉందా ?, రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయా ?, ప్రజలకు రక్షణ ఉందా ?, కోర్టులో లాయర్ ను కాల్చి చంపినా ఈ ప్రభుత్వం నిద్రలేవడం లేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏకిపారేయడం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Shock: A lawyer has been killed inside a district court complex in Uttar Pradesh's Shahjahanpur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X