Shock; ఫేమస్ ఆసుపత్రిలో డాక్టర్, రాత్రి డ్యూటీ నుంచి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య !
బెంగళూరు/శివమొగ్గ: ప్రముఖ ఆసుపత్రిలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ సిటీలోనే ఎంతో ఫేమస్ అయిన ఆసుపత్రిలో చాలా మంది డాక్టర్లు పని చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలు అదే ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వచ్చి వెలుతున్నారు.
Singer:
నాలుగు
రాష్ట్రాలు,
ఆరు
మంది
భార్యలు,
ఈ
సింగర్
పోటుగాడు,
పైగా
సిద్దాంతాలు,
ఎలా
చేశాడంటే
?
ఇదే ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ హడలిపోయారు. కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో ప్రముఖ ఆసుపత్రి ఉంది. శివమొగ్గలో ఆ ఆసుపత్రి చాలా ఫేమస్. శివమొగ్గ జిల్లాలోని ప్రజలు ఇదే ఆసుపత్రిలో చికిత్స చేయించుకొవడానికి ఆసక్తి చూపిస్తారు.

ఈ ఆసుపత్రిలో డాక్టర్ లోలిత్ (40) వైద్యుడిగా పని చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇదే ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ లోలిత్ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. రాత్రి డ్యూటీ ముగించుకున్న డాక్టర్ లోలిత్ ఆయన ఇంటికి వెళ్లారు. గురువారం డాక్టర్ లోలిత్ డ్యూటీకి రావలసి ఉంది.
డాక్టర్ లోలిత్ డ్యూటీకి రాపోవడంతో ఆసుపత్రి సిబ్బంది వెళ్లి చూశారు. రూమ్ లో డాక్టర్ లోలిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది హడలిపోయారు. కొంతకాలంగా గుండెజబ్బుతో డాక్టరో లోలిత్ బాదపడుతున్నారని, అదే విషయంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.