బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్యాక్షన్ పంజా: భూమి సర్వేకి వెళ్లిన తహసిల్దార్ దారుణ హత్య, సీఎం ఫైర్, రూ. 25 లక్షలు, సత్యభామ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కేజీఎఫ్: ప్రపంచంలోని ప్రజలు అందరూర కరోనా వైరస్ ( COVID 19) మహమ్మారి ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో మా ప్రాణాలు బలి తీసుకుంటుందో అనే భయంతో బతుకుతున్నారు. అయితే ఉద్యోగరీత్యా వివాదంలో ఉన్న భూమిని సర్వే చెయ్యడానికి వెళ్లిన ఓ తహసిల్దార్ ను రిటైడ్ టీచర్ కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు.

రక్తపు మడుగులో పడిన తహసిల్దార్ ను ఇప్పుడు నీవు భూమి సర్వే చూసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించు, తరువాత నేను తీరికగా వచ్చి చూసుకుంటాను అంటూ ఆ రిటైడ్ టీచర్ తలహసిల్దార్ ను చూసి సెటైర్లు వేసి పరారైనాడు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన తహసిల్దార్ దారుణ హత్యకు గురి కావడంతో ముఖ్యమంత్రితో పాటు మాజీ సీఎంలు, సాటి రెవెన్యూ శాఖ అధికారులు షాక్ కు గురైనారు. రాయలసీమ ఫ్యాక్షన్ రుచిమరిగిన ప్రాంతంలో తహసిల్దార్ హత్య జరిగింది.

Coronavirus: కరోనా కాటుకు తండ్రి మృతి, చిరంజీవి జోక్యంతో తలకొరివి పెట్టిన కుమార్తె, క్వారంటైన్!Coronavirus: కరోనా కాటుకు తండ్రి మృతి, చిరంజీవి జోక్యంతో తలకొరివి పెట్టిన కుమార్తె, క్వారంటైన్!

బంగారుపేటలో భూమి బంగారం

బంగారుపేటలో భూమి బంగారం

కర్ణాటకలోని కోలారు జిల్లా కేజీఎఫ్ సమీపంలోని బంగారుపేట (ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దు)లో భూములకు చాలా రేటు ఉంది. బంగారుపేటలో సాగుభూములతో పాటు సారవంతమైన భూములు ఎక్కువగా ఉండటంతో అక్కడి రైతులు నిత్యం ఏదోఒక పంట పండిసున్నారు. బంగారుపేటలో వ్యవసాయం చేస్తున్న వారు లక్షల రూపాయలు సంపాధిస్తున్నారు.

తహసిల్దార్ కు ఫిర్యాదు

తహసిల్దార్ కు ఫిర్యాదు

బంగారుపేట తహసిల్దార్ గా చంద్రమౌళేశ్వర్ ఉద్యోగం చేస్తున్నారు. బంగారుపేట నియోజక వర్గంలోని క్యాతసంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కారవంచి గ్రామంలో రిటైడ్ టీచర్ వెంకటపతి, రామమూర్తి అనే ఇద్దరి మధ్య భూవివాదం ఉంది. మా భూములు సర్వే చేసి ఎవరికి ఎంత భూమి వస్తుందో మీరు నిర్ణయించాలని ఇద్దరూ తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

భయంతో వెంట పోలీసులు

భయంతో వెంట పోలీసులు

గురువారం సాయంత్రం తాను భూములు సర్వే చెయ్యడానికి వస్తున్నానని తహసిల్దార్ చంద్రమౌళేశ్వర రిటైడ్ టీచర్ వెంకటపతికి, రామమూర్తికి సమాచారం ఇచ్చారు. చాలా కాలంగా వివాదంలో ఉన్న భూమిని సర్వే చెయ్యడానికి వెలుతున్న తహసిల్దార్ చంద్రమౌళేశ్వర్ ఎందుకైనా మంచిది అని క్యాతసంద్ర పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు పోలీసులను వెంట పిలుచుకుని వెళ్లారు. ఎందుకంటే బంగారుపేటతో పాటు ఆంధ్రా సరిహద్దు అయిన కోలారు జిల్లాలోని కొందరు భూస్వాములకు రాయలసీమ ఫ్యాక్షన్ లక్షణాలు వంటపట్టాయి.

సర్వే చేసిన పాపానికి!

సర్వే చేసిన పాపానికి!

రిటైడ్ టీచర్ వెంకటపతి, రామమూర్తి సమక్షంలో తహసిల్దార్ చంద్రమౌళేశ్వర్ భూములు సర్వే చేసి ఆ ప్రాంతంలో చెక్ బంధులు (రాళ్లు) నాటిపెట్టారు. మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి, మీకు అక్కడి నుంచి అక్కడికి భూములు ఉన్నాయని తహసిల్దార్ చంద్రమౌళేశ్వర్ ఇద్దరికి చెప్పారు. ఆ సమయంలో పక్కా ప్లాన్ ప్రకారం జోబులో కత్తిపెట్టుకుని వెళ్లిన వెంకటపతి తహసిల్దార్ చంద్రమౌళేశ్వర్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.

 కత్తితో పొడిచి సెటైర్లు వేసి పరార్

కత్తితో పొడిచి సెటైర్లు వేసి పరార్

ఇప్పుడు నువ్వు రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వు, తరువాత నేను తీరికగా వచ్చి చూస్తాను అంటూ రక్తపుమడుగులో పడి ఉన్న తహసిల్దార్ చంద్రమౌళేశ్వరపై సెటైర్లు వేసిన వెంకటపతి అక్కడి నుంచి పరారైనాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు పోలీసులు సైతం ఆవేశంతో ఊగిపోయి తహసిల్దార్ ను కత్తితో పొడిచిన రిటైడ్ టీచర్ వెంకటపతిని పట్టుకోవడానికి సాహసం చెయ్యలేకపోయారు. తీవ్రగాయాలైన తహసిల్దార్ చంద్రమౌళేశ్వర్ ను కోలారులోని ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై ఆయన గురువారం రాత్రి మరణించారు.

ఆంధ్రాకు పారిపోవాలని !

ఆంధ్రాకు పారిపోవాలని !

తహసిల్దార్ చంద్రమౌళేశ్వర్ ను కత్తితో పొడిచి పారిపోయిన రిటైడ్ టీచర్ వెంకటపతి దొంగదారిలో ఆంధ్రాకు పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే వెంటాడిని పోలీసులు అటవి ప్రాంతం నుంచి పారిపోతున్న వెంకటపతిని పట్టుకున్నారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి పగలు, రాత్రి అనే తేడా లేకుండా మూడు నెలల నుంచి కష్టపడుతున్న తహసిల్దార్ చంద్రమౌళేశ్వర్ విధినిర్వహణలో భాగంగా దారుణ హత్యకు గురి కావడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Recommended Video

Sushant గురించి మాట్లాడుతూ Heroine Sanjana లైవ్లో మేకప్.. నెటిజన్ల ట్రోల్స్ !
సీఎం సీరియస్, రూ. 25 లక్షలు పరిహారం

సీఎం సీరియస్, రూ. 25 లక్షలు పరిహారం

భూవివాదానికి సంబంధించి సమస్య పరిష్కరించడానికి వెళ్లిన తహసిల్దార్ చంద్రమౌళేశ్వర్ హత్యకు గురి అయ్యారని తెలుసుకున్న ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, మాజీ సీఎం సిద్దరామయ్య, స్థానిక ఎమ్మెల్యే నారాయణస్వామి విచారం వ్యక్తం చేశారు. వెంటనే నిందితుడు వెంకటపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చూసించారు. తహసిల్దార్ చంద్రమౌళేశ్వరి కుటుంబానికి సీఎం పరిహార నిధి నుంచి రూ. 25 లక్షలు పరిహారం ఇప్పిస్తామని, ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, నిందితుడు వెంకటపతిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోలారు జిల్లా కలెక్టర్ సత్యభామా మీడియాకు చెప్పారు. పోలీసు గౌరవ వందనంతో, ప్రభుత్వ లాంఛనాలతో తహసిల్దార్ చంద్రమౌళేశ్వర్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కోలారు జిల్లా కలెక్టర్ సత్యభామా మీడియాకు చెప్పారు.

English summary
Shock: Kolar Bangarapete tahsildar chandra mouleshwar stabbed by retired school teacher for land dispute and dies. The murder of Tahsildar Chandramauleshwar in connection with a land dispute in Karavanchi village in Bangarapet Taluk, Kolar, has announced a compensation of Rs 25 lakh for the family of the deceased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X