Secret Camera: ఆలయం ఆవరణంలో లేడీస్ బాత్ రూమ్ లో స్పై కెమెరాలు, స్నానం చేస్తుంటే !
చెన్నై: ప్రముఖ ఆలయంలో ప్రతినెల పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి భక్తులు ఆ గుడి దగ్గరకు వెళ్లి అక్కడే స్నానాలు చేసి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మహిళలు స్నానం చెయ్యడానికి గుడి ఆవరణంలో ఆలయ కమిటీ నాయకులు ప్రత్యేకంగా బాత్ రూమ్ లు కట్టించారు. పౌర్ణమి రోజు గుడిలో పూజలు చెయ్యడానికి వెళ్లిన మహిళ స్నానం చెయ్యడానికి బాత్ రూమ్ లోకి వెళ్లింది. ఆ సమయంలో బాత్ రూమ్ లో సంబంధం లేకుండా ఓ నల్లటి వైర్ తో ఏర్పాటు చేసిన స్పై కెమెరా చూసిన మహిళ హడలిపోయి ఆలయ కమిటీకి ఫిర్యాదు చేసింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆలయ కమిటీ నిర్వహకులు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ విషయం బయటకు లీక్ కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. గుడి ఆవరణంలోని బాత్ రూమ్ ల్లో రెండు స్పై కెమెరాలు ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించడంతో ఆ గుడికి ఇంతకాలం వెళ్లి వస్తున్న మహిళా భక్తులు హడిలిపోయారు.

ఫేమస్ గుడి
తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని సిద్దవనాయన్ పట్టి సమీపంలోని అరుల్మిగు గ్రామంలో శ్రీకామాక్షి అమ్మాన్ ఆలయం ఉంది. ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ కామాక్షి అమ్మాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే మంచి జరుగుతుందని తమిళనాడులోని అనేక జిల్లాల్లోని ప్రజలు చాలాకాలంగా నమ్ముతున్నారు.

ప్రతినెల పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు
శ్రీకామాక్షి అమ్మాన్ ఆలయంలో ప్రతినెల పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి భక్తులు ఆ గుడి దగ్గరకు వెళ్లి అక్కడే స్నానాలు చేసి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. దేవాలయం దగ్గర స్నానాలు చేసి శుభ్రంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చెయ్యాలని అక్కడి కొందరు పెద్దలు చెబుతున్నారని తెలిసింది.

గుడి ఆవరణంలోనే బాత్ రూమ్ లు
మహిళలు స్నానం చెయ్యడానికి శ్రీ కామాక్షి అమ్మాన్ గుడి ఆవరణంలో ఆలయ కమిటీ నాయకులు ప్రత్యేకంగా బాత్ రూమ్ లు కట్టించారు. పౌర్ణమి రోజు గుడిలో పూజలు చెయ్యడానికి వెళ్లిన మహిళ స్నానం చెయ్యడానికి బాత్ రూమ్ లోకి వెళ్లింది. ఆ సమయంలో బాత్ రూమ్ లో సంబంధం లేకుండా ఓ నల్లటి వైర్ తో ఏర్పాటు చేసిన స్పై కెమెరా చూసిన మహిళ హడలిపోయి ఆలయ కమిటీకి ఫిర్యాదు చేసింది.

బాత్ రూమ్ ల్లో రెండు స్పై కెమెరాలు
విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆలయ కమిటీ నిర్వహకులు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ విషయం బయటకు లీక్ కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. గుడి ఆవరణంలోని బాత్ రూమ్ ల్లో రెండు స్పై కెమెరాలు ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించడంతో ఆ గుడికి ఇంతకాలం వెళ్లి వస్తున్న మహిళా భక్తులు హడిలిపోయారు.

పరువు పోతుందని కేసు పెట్టకుండా ?
అయితే శ్రీకామాక్షి అమ్మాన్ ఆలయ కమిటీకి గిట్టని వాళ్లు కొందరు ఉన్నారని, ఆలయాని చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలా బాత్ రూమ్ ల్లో స్పై కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటారని శ్రీ కామాక్షి అమ్మాన్ ఆలయ కమిటీలోని కొందరు పెద్దలు అంటున్నారు. అయితే ఎంతో పేరుప్రతిష్టలు ఉన్న గుడి ఆవరణంలోని మహిళల బాత్ రూమ్ ల్లో స్పై కెమెరాలు ఏర్పాటు చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. అయితే ఇంత వరకు ఆలయ కమిటీ నిర్వహకులు ఈ విషయంపై ఫిర్యాదు చెయ్యలేదని స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు.