వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Shock: వచ్చిన పని పూర్తి కావాలని బ్యాంకులో పూజలు చేసిన దొంగలు, రూ. లక్షల నగదు, నగలు లూటీ!

|
Google Oneindia TeluguNews

కొచ్చి/కోల్లాం: కొత్త వ్యాపారాలు, కొత్త ఇంటిలోకి వెళ్లే సమయంలో, కొత్త వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఇలా శుభకార్యాలు మొదలుపెట్టే సమయంలో హిందువులు పూజలు చేసి అంతా మంచి జరగాలని దేవుడిని కోరుకుంటారు. అయితే చోరీ చెయ్యడానికి వెళ్లిన దొంగలు మా పంటపండాలని బ్యాంక్ అండ్ ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలో పూజలు చేసి లక్షల రూపాల విలువైన బంగారు నగలు, నగదు లూటీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

కేరళలోని కోల్లాంలో జరిగిన ఆ విచిత్రమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి, కోల్లాంలో పరాణపురం జనతా జంక్షన్ సమీపంలో పురాణం బ్యాంకర్స్ అనే ప్రముఖ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే సాయంత్రం బ్యాంక్ లో పని చేసే సిబ్బంది విధులు ముగించుకుని కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారు.

Shock: Thieves perform pooja in bank before looting gold and cash in Kerala.

అర్దరాత్రి దాటిన తరువాత దొంగలు బ్యాంక్ తాళం పగలగొట్టి లొపలికి వెళ్లారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మేము వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లేలా ఆశీర్వధించాలని దొంగలు బ్యాంక్ లో అండ్ ఫైనాన్స్ సంస్థ లోపల పూజలు చేశారు. తరువాత బ్యాంక్ లాకర్ లో ఉన్న రూ. 30 లక్షల విలువైన బంగారు నగలు, రూ. 4 లక్షల నగదు లూటీ చేశారు.

బ్యాంక్ అండ్ ఫైనాన్స్ సంస్థలో లూటీ చేసిన దొంగలు దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు బ్యాంక్ అండ్ ఫైనాన్స్ సంస్థ యజమాని రామచంద్రన్ నాయర్ వెళ్లి చూసి షాక్ కు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హడలిపోయారు. బ్యాంక్ అండ్ ఫైనాన్స్ సంస్థలో స్థానికులు బంగారు నగలు కుదువ పెట్టి నగదు తీసుకుంటున్నారని, కొందరు వడ్డీకి డబ్బులు తీసుకుంటున్నారని పోలీసులు అన్నారు. ఫైనాన్స్ సంస్థలో పూజలు చేసి నగలు, నగదు లూటీ చేసిన దొంగల కోసం కేరళ పోలీసులు వేట మొదలుపెట్టారు.

English summary
Shock: Thieves perform pooja in bank before looting gold and cash in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X