• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మమతాబెనర్జీకి షాక్ : సీఎంగా ప్రమాణం చేసి కొన్ని గంటల్లోనే దీదీకి కేంద్ర హోం శాఖ సీరియస్ వార్నింగ్

|

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తరువాత కూడా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపిపై నిర్ణయాత్మక విజయం సాధించిన తరువాత మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజున, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన మరో లేఖ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.దీదీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మోదీ వర్సెస్ దీదీ కొనసాగుతుందని తాజా పరిణామాల ద్వారా అర్థమవుతుంది. తాజా లేఖలో సీరియస్ వార్నింగ్ ఇచ్చి మమతకు కేంద్రం షాక్ ఇచ్చింది .

చెల్లెలు మమతా బెనర్జీ అంటూనే, హితబోధ చేసిన గవర్నర్ : సీఎంగా దీదీ ప్రమాణం తర్వాత షాకింగ్ సంఘటన!!చెల్లెలు మమతా బెనర్జీ అంటూనే, హితబోధ చేసిన గవర్నర్ : సీఎంగా దీదీ ప్రమాణం తర్వాత షాకింగ్ సంఘటన!!

 ఎన్నికల త్వరాత హింసపై నివేదిక కోసం కేంద్రం హోం శాఖ రెండో లేఖ.. సీరియస్ వార్నింగ్

ఎన్నికల త్వరాత హింసపై నివేదిక కోసం కేంద్రం హోం శాఖ రెండో లేఖ.. సీరియస్ వార్నింగ్

ఆదివారం ఎన్నికల ఫలితం తరువాత చోటు చేసుకున్న హింసపై కేంద్రం మే 3న వివరాలు అడిగినప్పటికీ ఎటువంటి నివేదిక సమర్పించపోవడంతో కేంద్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రెండవ సారి లేఖ రాసిన కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈ రెండవ లేఖను పాటించకపోవడం తీవ్రంగా పరిగణించబడుతుంది అని కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా హెచ్చరించారు. అంతేకాదు మొదటి లేఖ రాసిన రెండు రోజుల తరువాత బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వం హింసను అరికట్టడానికి ఇంతవరకు ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదని భల్లా ప్రశ్నించారు.

 బెంగాల్ ఎన్నికల అనంతర హింసపై సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సి, విచారణ

బెంగాల్ ఎన్నికల అనంతర హింసపై సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సి, విచారణ

పోల్ అనంతర హింస ఆగిపోలేదని సూచించే తాజా నివేదికలు ఉన్నాయని, హింసను ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, హింసకు సంబంధించిన నివేదికను వెంటనే పంపాలని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. మే 2 న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న ఎన్నికల అనంతర హింసను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) బుధవారం చర్యలకు పూనుకుంది . మానవ హక్కుల సంఘం తన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ దర్యాప్తును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

 దర్యాప్తు బృందం రంగంలోకి, రెండు వారాల్లోపు నివేదిక

దర్యాప్తు బృందం రంగంలోకి, రెండు వారాల్లోపు నివేదిక

ఈ విషయాన్ని పరిశీలించడానికి బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని బృందాన్ని కోరారు.అమాయక పౌరుల జీవిత హక్కును కాలరాసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుగా, కమిషన్ ఈ విషయంపై సుమోటోగా దర్యాప్తు మొదలుపెట్టింది. ఇన్వెస్టిగేషన్ కు డివిజన్ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని, దర్యాప్తును కొనసాగించాలని సూచించింది. అక్కడికక్కడే నిజనిర్ధారణ దర్యాప్తు జరిపేందుకు మరియు రెండు వారాల్లోపు ఒక నివేదికను త్వరగా సమర్పించడానికి దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది అని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలిపింది.

 బెంగాల్ లో హింసాకాండ , టీఎంసీని టార్గెట్ చేస్తున్న బీజేపీ , వామపక్షాలు

బెంగాల్ లో హింసాకాండ , టీఎంసీని టార్గెట్ చేస్తున్న బీజేపీ , వామపక్షాలు

నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్), నేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సిడబ్ల్యు) వంటి అనేక ఇతర మానవ హక్కుల సంస్థలు కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టాయి. బిజెపి, వామపక్షాలు రెండూ తృణమూల్ కాంగ్రెస్‌ ని టార్గెట్ చేస్తూ పశ్చిమబెంగాల్లో హింసాకాండకు టీఎంసీ కారణమని మండిపడుతున్నాయి. హింసాకాండలో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆందోళనల బాట పట్టింది .

 మమత సీఎంగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే కేంద్రం వార్నింగ్

మమత సీఎంగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే కేంద్రం వార్నింగ్

కావాలని ఆరోపణలు చేస్తూ, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో నకిలీ వీడియోలు మరియు చిత్రాలు వ్యాప్తి చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ , పశ్చిమ బెంగాల్ పోలీసులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఏదేమైనా మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ కేంద్రం తన అస్త్రాలను ప్రయోగించటం కొనసాగిస్తూనే ఉంది.తాజాగా హోం శాఖ, మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే, మమత ప్రభుత్వంపై సీరియస్ అవ్వడం ఎన్నికల తర్వాత కూడా బెంగాల్ వార్ కొనసాగుతుంది అని చెప్పడానికి నిదర్శనం.

English summary
The latest developments show that Modi vs Didi will continue even after Didi is sworn in as CM. The Center gave a serious warning to Mamata in the latest letter. The Center was outraged that no report was submitted on May 3 despite asking for details on the violence that took place after the election result on Sunday. I remind you that Union Home Secretary Ajay Bhalla wrote a letter to this effect for the second time. Failure to comply with this second letter is a serious matter. "
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X