వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గన్నులు చూపిస్తూ డాన్సులు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు షాక్..! ఆరేళ్లపాటు పార్టీ నుంచి నిషేదం..!!

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్/హైదరాబాద్ : వివాదాలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్‌కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ప్రణవ్ సింగ్ చాంపియన్‌ను ఆరేళ్లపాటు సస్సెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఖాన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. కొద్ది రోజుల క్రితం కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంతోషంతో తన అనుచరులకు ఓ హోటల్‌లో పార్టీ ఇచ్చారు.

ఆ పార్టీలో మద్యం సేవించిన ప్రణవ్ సింగ్.. తుపాకులతో హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన పార్టీ అధిష్టానం.. ప్రణవ్ సింగ్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా.. గతంలో ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో ఆయనను మూడు నెలలపాటు సస్పెండ్ చేసిన అధిష్టానం.. తాజా ఘటన నేపథ్యంలో ఆరేళ్లు సస్పెండ్ చేసింది.

Shocked with guns by BJP MLA.. Party banned for six years .. !!

మద్యం సేవిస్తూ గన్స్‌ను చేతబట్టి డ్యాన్స్‌లు చేస్తూ కెమెరాకు చిక్కిన ఉత్తరాఖండ్‌ ఎమ్మెల్యే కన్వర్‌ ప్రణవ్‌ సింగ్‌ ఛాంపియన్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించినట్టు బీజేపీ బుధవారం వెల్లడించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో కున్వర్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు మూడు పిస్టల్స్‌, రైఫిల్స్‌ చూపుతూ డ్యాన్స్‌ చేయడం దుమారం రేపింది.

తాను చేస్తున్న ఈ ఫీట్‌ను దేశంలో ఏ ఒక్కరూ చేయలేరని బీజేపీ ఎమ్మెల్యే ఈ వీడియోలో అనుచరులతో చెప్పడం వినిపించింది. ఎమ్మెల్యే చర్యపై పార్టీ వివరణ కోరగా ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో చర్య తీసుకున్నామని బీజేపీ జాతీయ మీడియా ఇన్‌చార్జి అనిల్‌ బలూనీ తెలిపారు. అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించాలని బీజేపీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించిందని చెప్పారు.

English summary
Dancing with three pistols and rifles was a problem. In this video, BJP MLA is heard telling his followers that no one in the country can do this feat. Anil Baluni, BJP's national media incharge, said his party's response to the party's explanation for the MLA's action was not satisfactory. The BJP Disciplinary Committee has decided to expel the improperly-behaved MLA from the party for six years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X