వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్ : చనిపోయాడని అంత్యక్రియలు చేస్తుండగా ఏమి జరిగిందో చూడండి?

|
Google Oneindia TeluguNews

జైపూర్ : ఈ వార్త చదివితే నిజంగానే షాక్ అవుతారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేవడం ఎక్కడైనా చూశారా... కనీసం విన్నారా...? సాధారణంగా ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తాం. కానీ నిజంగా కూడా ఓ పెద్దాయన చనిపోయి తిరిగి లేచాడు. ఇదెక్కడో తెలుసా.. రాజస్థాన్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

చనిపోయిన పెద్దాయన బుద్ధ్ రామ్

చనిపోయిన పెద్దాయన బుద్ధ్ రామ్

రాజస్థాన్‌లోని జున్‌జును జిల్లాలో ఖేత్రీ గ్రామంలోని ఓ గుజ్జర్ కుటుంబానికి చాలా ముందే ఆ ఇంట్లో దీపావళి వచ్చేసింది. కారణం ఏమిటో తెలుసా...ఆ కుటుంబంలోని 95 ఏళ్ల పెద్దాయన చనిపోయి తిరిగి లేచాడు. దీంతో ఆ ఇంట్లో దీపావళికి ముందే పండగ వచ్చేసింది. ఇక అసలు విషయానికొస్తే బుద్ద్ రామ్ గుజ్జర్ అనే 95 ఏళ్ల పెద్దాయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక తన అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. చివరి స్నానానికి మృతదేహాన్ని సిద్ధం చేశారు.

ఆచారంలో భాగంగా కేశఖండన కార్యక్రమం కూడా జరిగింది

ఆచారంలో భాగంగా కేశఖండన కార్యక్రమం కూడా జరిగింది


ఇక కుటుంబంలోని మగవారు తమ ఆచారంలో భాగంగా కేశాలు కూడా తీసేశారు. ఇక మృతదేహాన్ని చివరిస్నానం కోసం సిద్ధపరిచారు. అంతే ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. చనిపోయిన బుద్ద్ రామ్ గుజ్జర్ తిరిగి ప్రాణాలతో బతికి వచ్చాడు. అప్పటి వరకు శాశ్వతంగా నిద్రపోయాడని భావించిన కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. చనిపోయడని అనుకున్న ఇంటి పెద్ద దిక్కు ప్రాణాలతో తిరిగి రావడంతో సంబురాలు చేసుకున్నారు.

గుండెలో నొప్పి రావడంతో పడిపోయిన బుద్ధరామ్

గుండెలో నొప్పి రావడంతో పడిపోయిన బుద్ధరామ్

ఇక అసలు విషయానికొస్తే... బుద్ద్ ‌రామ్ శనివారం మధ్యాహ్నం స్పృహ కోల్పోయాడు. అతని కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అక్కడి డాక్టర్ రామ్ చనిపోయినట్లు ప్రకటించారు. చనిపోయాడన్న సంగతి తెలిసి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఓ పూజారిని కూడా రమ్మని కబురుపంపారు. ఇంటికి చేరుకున్న పూజారి మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే వారి కుటుంబంలోని మగవారికి కేశఖండన కార్యక్రమం కూడా జరిపించారు.

స్నానం చేయిస్తుండగా వణికిన బుద్ద రామ్

స్నానం చేయిస్తుండగా వణికిన బుద్ద రామ్


స్నానం చేయించేందుకు తీసుకువచ్చినట్లు చెప్పాడు పెద్ద కుమారుడు బాలురామ్. ఎప్పుడైతే నీళ్లు బుద్ధరామ్ ఒంటిపై పడ్డాయో ఒక్కసారిగా వణికాడు. ఇది గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు బుద్ధరామ్‌ను పరుపుపై పడుకోబెట్టారు. ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టారు. అసలు ఏమి జరిగిందని అతన్ని అడుగగా... తనకు గుండెలో నొప్పి రావడంతో నిద్రపోయినట్లు చెప్పాడు. ఇదంతా ఒక అద్భుతం అని కొడుకు బాలు రామ్ చెప్పాడు. తన తండ్రి చనిపోయి ఉంటే దీపావళి వెలుగులు తమ ఇంట కనిపించేవి కాదని... ఇది తమకు నిజమైన దీపావళి పండగని బాలురామ్ చెప్పాడు.

English summary
This Diwali will indeed be special for a Gujjar family of Khetri tehsil in Jhunjhunu district, where 95 year old member came back to life after being declared dead.Men of the family had even shaved their heads and were completing pre funeralrituals when the body of Budh Ram Gujjar was taken for a customary bath. A few minutes later the dead man came back to life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X