చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్ ...వంద కోట్ల నగదు పట్టివేత .. ఓటర్లకు పంచే డబ్బేనా ?

|
Google Oneindia TeluguNews

దేశంలో ఎన్నిక‌ల వేళ ఇంతకాలం గుట్టుగా దాచిన కట్తల పాములు బయటకు వస్తున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టటం కోసం పంచేందుకు సిద్ధం చేసిన నగదు ఎక్కడెక్కడ దాచారో పట్టుకునే పనిలో పడ్డారు సంబంధిత అధికారులు. ఈసారి ఎన్నికల్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుందని భావించిన నేపధ్యంలోనే అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే క్రమంలో పైసలు వేదజల్లటానికి రాజ‌కీయ నేత‌లు సిద్ధ‌మ‌య్యారు. దాంతో ఇన్నాళ్ల‌పాటు క‌లుగుల్లో దాక్కున్న క‌ట్ట‌ల‌పాములు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.

<strong>ధన, కనక, వస్తు, వాహన రూపేణా..! ఏపీలో ప్రలోభాల పర్వం మొదలు: భారీగా నగదు పట్టివేత</strong>ధన, కనక, వస్తు, వాహన రూపేణా..! ఏపీలో ప్రలోభాల పర్వం మొదలు: భారీగా నగదు పట్టివేత

బయటకు వస్తున్న నల్లధనం.. దేశంలో అవినీతికి నిదర్శనం

బయటకు వస్తున్న నల్లధనం.. దేశంలో అవినీతికి నిదర్శనం

నల్ల ధనం... జనాలకు పంచటానికి దాచిన నల్ల ధనం, ప్రలోభపెట్టటానికి, ఓటర్లను రేటు నిర్ణయించి కొనుగోలు చెయ్యటానికి దాచిన నల్ల ధనం, రాజకీయ నాయకుల అవినీతికి నిదర్శనంగా కనిపిస్తున్న నల్ల ధనం రాజ‌కీయ నేత‌ల చ‌ర్య‌ల‌తో ఇన్నాళ్లు మూట‌ల్లో మూలుగుతున్న న‌ల్ల‌ధనం ఇప్పుడు ర‌హ‌స్యంగా ఓట‌ర్ల తలుపులు త‌డుతున్నాయి. అయితే, అప్పుడ‌ప్పుడు అధికారుల త‌నిఖీల్లో ప‌ట్టుబ‌డుతున్న‌ది కొద్ది మొత్తాలు మాత్రమే . కానీ, సీక్రెట్‌గా త‌ర‌లి వెళుతున్న సంచుల లెక్క‌లు ప‌క్కాగా తీస్తే మాత్రం క‌ళ్లు బైర్లు కమ్ముతాయంటే అతిశయోక్తి కాదు

ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం ... దాడులు చేస్తున్న అధికారులు

ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం ... దాడులు చేస్తున్న అధికారులు

ఇక ఇవ్వాళ చెన్నై లో పట్టుబడిన నగదును చూస్తే అర్ధం అవుతుంది. ఎంతగా ఓటర్ల కొనుగోలు జరుగుతుందో .. చెన్నైలో గుట్ట‌లు, గుట్ట‌లుగా పోగుబ‌డ్డ సంచుల‌ను చూస్తే మన రాజకీయ నాయకులు ఎంత అవినీతిపరులో ,... ఐటీ అధికారులు డీఎంకే నేత‌ల నివాసాల్లో, కార్యాల‌యాల్లో ఈ రోజు దాడుల ప‌ర్వం మొద‌లు పెట్టారు. ఈ త‌నిఖీల్లో న‌గ‌దు భారీగా ప‌ట్టుబ‌డింది. డీఎంకే కోశాధికారి దురై ముర‌గ‌న్‌కు చెందిన సొంత మెడిక‌ల్ కాలేజీ, సిమెంట్ ఫ్యాక్ట‌రీలో ఐటీ అధికారులు దాడులు చేశారు. సిమెంట్ ఫ్యాక్ట‌రీ గోదాముల్లో చేప‌ట్టిన త‌నిఖీల్లో మూట‌లు.. మూట‌లుగా అట్ట పెట్టెల్లో దాచిన న‌గ‌దు భారీగా ప‌ట్టుబ‌డింది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న ఐటీ అధికారులు మ‌రింత లోతుగా విచారిస్తున్నారు.

చెన్నై లో పట్టుబడిన వంద కోట్ల నగదు ఎవరిది ?

చెన్నై లో పట్టుబడిన వంద కోట్ల నగదు ఎవరిది ?

చెన్నై లో నేడు జరిపిన దాడుల్లో 200కు పైగా క‌ట్ట‌ల్లో న‌గ‌దు బ‌య‌ట‌ప‌డింది. లెక్క క‌డితే వంద కోట్ల‌కు పైగా ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు. మ‌రి గుట్ట‌లు.. గుట్ట‌లుగా పోగుప‌డ్డ ఈ సంచుల్లోని న‌గ‌దు ఎవ‌రిది..? ఎక్క‌డికి తర‌లిస్తున్నారు..? ఎందుకు ఇక్క‌డ సీక్రెట్‌గా ఉంచారు..? ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను ప్రలోభ పెట్టటం కోసం ఈ డబ్బును సిద్ధం చేశారా..? అన్న‌ది తేలాల్సి ఉంది. మొత్తానికి ఎన్నికలలో నగదు పెద్ద ఎత్తున పంపిణీ అవుతున్నదన్న నిజం ఈ వ్యవహారం ద్వారా తేటతెల్లం అవుతుంది.

English summary
IT officials in Chennai caught up with 100 crore cash. IT officials have started a series of rides in the residences and offices of DMK leaders today. These checks are heavily gripped by cash. IT officials were attacked DMK Treasurer Durai Murugan's own medical college and cement factory. In the cement factory godown bundles of money in the hidden bales. The IT officials filed the case and investigating .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X