• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివర్సిటీలు .. ఏపీలో కూడా ఒక నకిలీ వర్సిటీ : వెల్లడించిన కేంద్రం

|

దేశవ్యాప్తంగా 24 యూనివర్సిటీలను నకిలీ యూనివర్సిటీలు గా గుర్తిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటన చేసిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దేశంలో మరో రెండు యూనివర్సిటీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, సాధారణ ప్రజల నుండి మరియు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 24 యూనివర్సిటీలను నకిలీ గా తేల్చిందని ఆయన వెల్లడించారు. ఇక దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఎనిమిది నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

దేశంలో నకిలీ వర్సిటీలు ... యూపీలోనే 8 నకిలీ వర్సిటీలు

దేశంలో నకిలీ వర్సిటీలు ... యూపీలోనే 8 నకిలీ వర్సిటీలు

భారతీయ శిక్షా పరిషత్, లక్నో, యుపి మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ (ఐఐపిఎం), కుతుబ్ ఎన్‌క్లేవ్, న్యూ ఢిల్లీ అనే మరో రెండు సంస్థలు కూడా యుజిసి చట్టం, 1956 ని ఉల్లంఘిస్తూ పనిచేస్తున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి సంస్కృత విశ్వవిద్యాలయం వారణాసి, మహిళా గ్రామ విద్యాపీఠం అలహాబాద్, గాంధీ హిందీ విద్యాపీఠ్ అలహాబాద్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి కాన్పూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ అలీఘర్, ఉత్తర ప్రదేశ్ విశ్వవిద్యాలయ మధుర, మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వ విద్యాలయం, ప్రతాప్‌గఢ్ మరియు ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, నోయిడాలు నకిలీ యూనివర్సిటీలని ఆయన పేర్కొన్నారు.

 ఢిల్లీలో ఏడు యూనివర్సిటీలు నకిలీవే

ఢిల్లీలో ఏడు యూనివర్సిటీలు నకిలీవే


ఢిల్లీలో అలాంటి ఏడు నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని వెల్లడించిన కేంద్రమంత్రి కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఒకేషనల్ యూనివర్శిటీ, ఎడిఆర్ సెంట్రిక్ జురిడిషియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ఆధ్యాత్మిక విశ్వవిధ్యాలయాలు కూడా నకిలీవని తేల్చిచెప్పారు. ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్‌లో అలాంటి రెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా, అలాగే భారత్ శిక్షా పరిషత్, రూర్కెలా మరియు నార్త్ ఒరిస్సా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ కూడా నకిలీవే అని ఆయన స్పష్టం చేశారు

 ఏపీలోనూ ఒక నకిలీ విశ్వ విద్యాలయం

ఏపీలోనూ ఒక నకిలీ విశ్వ విద్యాలయం

కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి మరియు మహారాష్ట్రలలో ఒక్కొక్కటి నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, పుదుచ్చేరి; క్రైస్ట్ న్యూ టెస్ట్ మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్, రాజా అరబిక్ విశ్వవిద్యాలయం నాగపూర్, సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం, కేరళ , బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కర్ణాటకలు కూడా నకిలీవని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

నకిలీ యూనివర్సిటీలపై యూజీసీ చర్యలు

నకిలీ యూనివర్సిటీలపై యూజీసీ చర్యలు

నకిలీ, గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలపై యుజిసి తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూ,జాతీయ హిందీ మరియు ఇంగ్లీష్ వార్తాపత్రికలలో నకిలీ విశ్వవిద్యాలయాలు, సంస్థల జాబితా గురించి యుజిసి పబ్లిక్ నోటీసులు జారీ చేస్తుందని ఆయన పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. తమ అధికార పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, విద్యా కార్యదర్శులు మరియు ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాస్తుందని ఆయన చెప్పారు. మొత్తానికి దేశవ్యాప్తంగా 24 నకిలీ యూనివర్సిటీలు విద్యా ప్రమాణాలకు తిలోదకాలిస్తూ కొనసాగుతున్నాయని మంత్రి ధర్మేంద్ర ప్రాధాన్ వెల్లడించారు .

English summary
Union Education Minister Dharmendra Pradhan has said that the University Grants Commission has declared 24 universities across the country as fake universities. He was responding in writing to a question by members of the Lok Sabha that two other universities in the country had violated the rules, adding that Uttar Pradesh had the highest number of eight fake universities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X