వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైప్రొఫైల్ సెక్స్ రాకెట్: నటి అరెస్ట్, ఒకరోజుకు రూ.లక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగర పోలీసులు గుర్‌గావ్‌లో హై ప్రొపైల్ సెక్స్ రాకెట్‌ను రట్టు చేశారు. ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు... ఈ సెక్స్ రాకెట్లో ఓ నటి కమ్ మోడల్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది.

ఆమె 'సావధాన్ ఇండియా' నటి అని వార్తలు వస్తున్నాయి. అయితే, పోలీసులు మాత్రం అరెస్టైన సదరు యువతి సావధాన్ ఇండియా నటి అని పేర్కొనలేదు. సమాచారం మేరకు.. సెక్స్ రాకెట్ గురించి తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడకు వెళ్లి పలువురు అమ్మాయిలను అరెస్టు చేశారు.

సెక్స్ రాకెట్ గురించి మాట్లాడుతూ... సెక్స్ రాకెట్ గురించి సమాచారం తెలియగానే తాము వెళ్లామని పోలీసులు చెప్పారు. సెక్స్ రాకెట్ నేపథ్యంలో అమ్మాయిలను సరఫరా చేస్తున్న కీలక నిందితులు సైరా, అసారాఫ్ అలియాస్ అమన్‌లను అరెస్టు చేసేందుకు వెళ్లామని చెప్పారు. తాము అక్కడకు వెళ్లి, వారితో పాటు పలువురు అమ్మాయిలన అరెస్టు చేశామని చెప్పారు.

Shocking! High-profile sex racket busted in Mumbai; 'Savdhaan India' actress arrested

ఈ సెక్స్ రాకెట్లో ముగ్గురు యువతులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే, అరెస్టైన వారిలో ఓ మరాఠీ నటి కమ్ మోడల్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రముఖ క్రైం షో సావధాన్ ఇండియాలో నటించిన నటి. కాగా, ఒక్కో యువతికి రూ.50వేల నుంచి రూ.లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అక్కడకు కార్పోరేట్ క్లయింట్లు వస్తున్నారు.

మహారాష్ట్ర రాజధాని ముంబై నగర పోలీసులు గుర్‌గావ్‌లో హై ప్రొపైల్ సెక్స్ రాకెట్‌ను రట్టు చేశారు. ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు... ఈ సెక్స్ రాకెట్లో ఓ నటి కమ్ మోడల్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది. ఆమె 'సావధాన్ ఇండియా' నటి అని వార్తలు వస్తున్నాయి. అయితే, పోలీసులు మాత్రం అరెస్టైన సదరు యువతి సావధాన్ ఇండియా నటి అని పేర్కొనలేదు.

English summary
The Mumbai Police has busted a high-profile sex racket in Goregaon. Reportedly, many high profile girls including a 'Savdhaan India" actress were involved in the prostution business. Police has not revealed the name of 'Savdhaan India" girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X