• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !

|

బెంగళూరు: భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు అనుమానాలు ఉన్న విషయం మనం చాలానే చూశాం. ఒకరి మీద ఒకరికి అనుమానాలు రావడం, విడాకులు తీసుకోవడం, హత్యలు జరగడం ప్రతిరోజు మనం ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం. అయితే భార్య మీద అనుమానంతో ఓ భర్త ఏం చేశాడో తెలుసుకుని అందరూ షాక్ అవుతున్నారు. ఒటికాదు రెండు కాదు ఏకంగా 17 ఏళ్లు ఇంట్లోని కబోడ్ లో దాక్కొని భార్య బండారం బయటపెట్టాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. ఉద్యోగానికి వెలుతున్నానని ఉదయం బయటకు వెళ్లడం, కొద్ది సేపటికి ఇంట్లోని కబోడ్స్ లో దాక్కొని భార్య రంకు బయటపెట్టాలని ఏన్నో ఏళ్లు ప్రయత్నించిన భర్త శాడిజం బయటకు రావడంతో పోలీసులు, మత పెద్దలు షాక్ కు గురైనారు.

Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !

 తొక్కలో వీడిది లవ్ మ్యారేజ్

తొక్కలో వీడిది లవ్ మ్యారేజ్

బెంగళూరులోని మహదేవపుర ప్రాంతంలో రాణి ( 38) అనే మహిళ, రాజు ( 45) అనే వ్యక్తి (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నారు. 2001లో రాజు, రాణికి పరిచయం అయ్యింది. ఒక సంవత్సరం పాటు ఒకరి గురించి ఒకరు తెలుసుకుని స్నేహంగా ఉన్నారు. తరువాత రాజు, రాణి ప్రేమించుకుని 2002లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి బెంగళూరులోని మహదేవపుర ప్రాంతంలోని ఒకే ఇంట్లో రాజు, రాణి ఇప్పటి వరకు కాపురం ఉంటున్నారు.

 సంవత్సరానికే శాడిజం

సంవత్సరానికే శాడిజం

పెళ్లి జరిగిన సంవత్సరం పాటు రాజు భార్య రాణితో చాలా సంతోషంగా ఉన్నాడు. తరువాత భార్య రాణి మీద రాజుకు అనుమానం పెరిగిపోయింది. తనతో కాకుండా తన భార్య రాణి పరాయి మగాళ్లతో లింక్ పెట్టుకుందని రాజుకు అనుమానం పెరిగిపోయింది. ప్రముఖ సెక్యూరిటీ సంస్థలో రాజు ఉద్యోగం చేసేవాడు.

 కాపురం చెయ్యాలంటే !

కాపురం చెయ్యాలంటే !

ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రాణితో రాజు సక్రమంగా కాపురం చేసేవాడు కాదు. ఇష్టం ఉండిలేనట్లు కాపురం చేశారు. రాజు, రాణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాణి ఉద్యోగం చేస్తూ కాపురం నెట్టుకోస్తోంది. అయితే భర్త రాజుకు ఒకటే పని, రోజు కబోడ్స్ లో దాక్కోవడం, ఎలాగైనా భార్య పరాయి మగాళ్లతో జల్సా చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్రయత్నాలు చెయ్యడం. రాజు ప్రతిరోజు ఇదే పనిగా పెట్టుకున్నాడు.

 రాజు కబోడ్ మాస్టర్ ప్లాన్

రాజు కబోడ్ మాస్టర్ ప్లాన్

ఎలాగైనా తన భార్య రంకు బయటపెట్టాలని రాజు నిర్ణయించాడు. గత 17 ఏళ్ల నుంచి రాజు అతని భార్యకు షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగానికి వెలుతున్నానని భార్య రాణికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెలుతున్న రాజు తరువాత మరో తాళం ఉపయోగించి గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇంట్లోని అల్మారలోని కబోడ్ లో దాక్కొంటున్న రాజు ఎలాగైనా తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని 17 ఏళ్ల పాటు అనేక ప్రయత్నాలు చేశాడు.

 భార్య అమాయకురాలు ?

భార్య అమాయకురాలు ?

గత 17 ఏళ్ల నుంచి ఉద్యోగానికి నామం పెట్టి భార్య రంకు రామయణం బయటపెట్టాలని భర్త రాజు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం ఒకసారి భార్య ఏదో పనికిరాని వస్తువులు కబోడ్ లో వెయ్యడానికి దాని డోర్ తీసింది. అంతే అందులో భర్త రాజు దాక్కొని ఉన్న విషయం గుర్తించి షాక్ కు గురైయ్యింది. ఎంతకాలంగా ఈ గూడాచార్యం చేస్తున్నావ్ ? అంటూ భర్తను రాణి నిలదీసింది. అంతే అప్పటి నుంచి రాజు అతని భార్య రాణిని పట్టుకుని చితకబాదడం మొదలుపెట్టాడు.

 పాలు, పేపర్ బాయ్స్ ను వదల్లేదు

పాలు, పేపర్ బాయ్స్ ను వదల్లేదు

తన భార్య యవ్వనంగా, చాలా అందంగా ఉందని, ఎవరైనా ఆమె వలలో పడిపోతారని రాజుకు ఎక్కువ అనుమానం ఉంది. ఇలా భార్య రాణి మీద రోజురోజుకు అనుమానం పెరిగిపోవడంతో రాజు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చివరికి పాలు వేసే వ్యక్తి, పేపర్ బాయ్ లతో గొడవ పెట్టుకుంటున్న రాజు రచ్చరచ్చ చేసి భార్య రాణి పరువు బజారుకు ఈడ్చడానికి అనేకసార్లు ప్రయత్నించాడని వెలుగు చూసింది.

 ఏం రోగం లేదు, బాగానే ఉన్నాడు

ఏం రోగం లేదు, బాగానే ఉన్నాడు

భర్త రాజు ప్రవర్తనపై విసిగిపోయిన భార్య రాణి బెంగళూరులోని పోలీసులను ఆశ్రయించింది. పోలీసు శాఖకు చెందిన వనిత సహాయవాణి కేంద్రంలోని బింద్యా యోహన్నా అనే మహిళా అధికారి రాజు, రాణికి కౌన్సిలింగ్ చేశారు. రాజుకు మానసిక పరిస్థితి బాగాలేదని ఆయనకు రెండేళ్ల పాటు చికిత్స అందించారు. అయితే చికిత్సను మద్యలో నిలిపివేశాడని బింద్యా యోహన్నా సమాచారం ఇచ్చారని, అంతే కాకుండా తన భార్య నడవడిక సక్రమంగా లేదని, అనేక మందితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని రాజు ఆరోపణలు చెయ్యడం మొదలుపెట్టాడని బింద్యా యోహన్నా సమాచారం ఇచ్చారని ప్రముఖ దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. అయితే ఇంట్లో పిల్లలతో రాజు మామూలుగానే ఉన్నాడని, మతిస్థిమితం బాగానే ఉందని చుట్టుపక్కల వాళ్లు అంటున్నారు.

  Yuzvendra Chahal Wicked Reply To Shikhar Dhawan Dance Video || Oneindia Telugu
   నా వల్లకాదు, ఏం లాభం లేదు

  నా వల్లకాదు, ఏం లాభం లేదు

  తన భర్త రాజు ప్రవర్తనతో విసిగిపోయానని, మీరే న్యాయం చెయ్యాలని, ఇక అతనితో కలిసి తాను జీవించలేనని రాణి చర్చి కమిటీ సభ్యులను ఆశ్రయించింది. అయితే తన భార్యకు పిచ్చిపట్టిందని, ఆమె ఫోన్ కాల్స్ మీరు స్వీకరించరాదని, ఆమె ఫిర్యాదులు మీరు పట్టించుకోరాదని భార్య రాజు చర్చి కమిటీ సభ్యులను నమ్మించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. మొత్తం మీద భర్త రాజు భార్య రాణి మీద ఎక్కువ అనుమానం పెంచుకున్నాడని, అతని అనుమానం పూర్తిస్థాయిలో పెరిగిపోయిందని, ఇక ఎవ్వరూ ఏమి చెయ్యలేరని ఓ పోలీసు అధికారి అంటున్నారని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది.

  English summary
  Innocent Wife: A 38-year-old woman was allegedly assaulted by her husband after she found him hiding in a cupboard to spy on her at their residence in Karnataka’s Bengaluru.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X