వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లేన్‌లో సోనూనిగమ్ పాట: సిబ్బందిపై వేటు(వీడియో)

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు సోనూనిగమ్‌ ఇటీవల విమానంలో పాట పాడుతుండగా, ప్రయాణికులంతా ఆయనతో గొంతు కలిపి సందడి చేశారు. ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఇదే ఆ విమాన సిబ్బంది కొంపముంచింది.

వివరాల్లోకి వెళితే.. సోనూ నిగమ్‌ని విమానంలో చూసిన ప్రయాణికులు పాట పాడమని కోరగా ఆయన అంగీకరించి పాటపాడి వారిని అలరించారు. కాగా, విమానంలో ఆ సందడిని వీడియో తీసిన పలువురు యూట్యూబ్‌లో పెట్టారు. దీంతో అది వైరల్‌గా కూడా మారింది.

Shocking: Jet Airways suspends air hostesses for Bollywood singer Sonu Nigam

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. అది కూడా ఆ విమానంలోని సిబ్బందికి మాత్రమే. సోనూ నిగమ్ ప్రయాణికుల కోసం పాట పాడితే పాడారు కానీ, అందుకు విమానంలోని ఎడ్రస్‌ సిస్టమ్‌ ఉపయోగించడం తప్పయిపోయింది.

విమానసిబ్బంది మాత్రమే ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడటానికి దాన్ని ఉపయోగిస్తారు. దానిని సోనూ నిగమ్‌ ఉపయోగించగా, విమానంలో ఎయిర్‌హోస్టెస్‌లుగా ఉన్న ఐదుగురు అందుకు అభ్యంతరం చెప్పనందుకు వారి ఉద్యోగాలకే ఎసరువచ్చింది.

జెట్‌ఎయిర్‌వేస్‌ సంస్థ ఆ ఐదుగురు సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేదని.. అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పాట పాడిన సోనూ నిగమ్.. ఎంజాయ్ చేసిన ప్రయాణికులు బాగానే ఉన్నా.. మధ్యలో విమాన సిబ్బంది మాత్రం తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి రావడం గమనార్హం.

అసలైన అసహనం ఇదే

విమాన సిబ్బందిపై వేటు వేయడాన్ని సోనూ నిగమ్ తప్పుబట్టారు. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. అసలైన అసహనం అంటే ఇదేనని వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌ గాయకుడు సోనూనిగమ్‌. విమానాల్లో చిన్న చిన్న సరదాలు జరుగుతూ ఉంటాయని పైలట్లు, సిబ్బంది ప్రయాణికులను ఉత్తేజపరచడానికి సరదాగా జోక్స్‌ వేసుకోవడం తాను చూశానని సోనూ నిగమ్‌ పేర్కొన్నారు.

ఓసారి విమానంలో పెద్ద ఎత్తున ఫ్యాషన్‌ షో నిర్వహించడం తాను చూశానన్నారు. అలాంటిది ప్రయాణికులు అభిమానంతో అడిగినందుకు తాను పాట పాడితే సిబ్బందిని ఉద్యోగాలనుంచి తొలగించడం దారుణమన్నారు.

ప్రయాణం సాఫీగా సాగుతోందని, సిబ్బంది ఎలాంటి ప్రకటనలు చేయాల్సిన అవసరం లేని సమయంలోనే తాను విమానంలోని అడ్రెసింగ్‌ సిస్టమ్‌ని ఉపయోగించానని ఆయన తెలిపారు. ఈ చర్య సంతోషాన్ని పంచేవారిని శిక్షించడమేనని, అది తగదని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
National carrier Jet Airways has taken a stern action while suspending 5 of its cabin crew staff. The air hostesses have been suspended for allowing Bollywood singer Sonu Nigam to use the "address system of the plane".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X