వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత పార్టీ నేతలే చంపారా?.. స్మృతి ఇరానీ అనుచరుడి హత్యకేసులో కొత్త కోణం

|
Google Oneindia TeluguNews

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైన స్మృతి ఇరానీ అనుచరుడు సురేంద్ర సింగ్ హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. షాకింగ్ విషయం బయటపడేసరికి స్థానికంగా కలకలం రేపుతోంది. లోకల్‌గా సొంత పార్టీ నేతలతో ఉన్న పాత కక్షలే కారణమని పోలీసులు వెల్లడించారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేళ స్మృతి ఇరానీకి సపోర్ట్ చేసినందుకు ఆయనను హత్య చేశారనే ప్రచారం జరిగింది.

 స్మృతి ఇరానీకి ప్రధాన అనుచరుడి హత్య కేసు

స్మృతి ఇరానీకి ప్రధాన అనుచరుడి హత్య కేసు

సురేంద్ర సింగ్ మర్డర్ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అయితే ఆయనను హతమార్చేందుకు స్కెచ్ వేశాడనే ఆరోపణలతో దరమ్‌నాథ్ అనే వ్యక్తి పైనా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదలావుంటే నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

స్మృతి ఇరానీకి అనుచరుడిగానే కాకుండా.. అత్యంత సన్నిహితంగా ఉండే సురేంద్ర సింగ్ ను ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో దుండగులు కాల్చి చంపారు. అనుచరుడి మృతి వార్త తెలియగానే ఆమె అమేథికి చేరుకున్నారు. సురేంద్ర సింగ్ పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మోడీతో కిషన్ రెడ్డి చనువు.. సెంట్రల్ కేబినెట్‌లో కుర్చీమోడీతో కిషన్ రెడ్డి చనువు.. సెంట్రల్ కేబినెట్‌లో కుర్చీ

కాంగ్రెస్ నేతలపై అనుమానం.. కానీ, సొంత పార్టీ నేతలే..!

కాంగ్రెస్ నేతలపై అనుమానం.. కానీ, సొంత పార్టీ నేతలే..!

స్మృతి ఇరానీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకే తన తండ్రిని కాంగ్రెస్ లీడర్లు మర్డర్ చేయించారని ఆయన కుమారుడు చేసిన ఆరోపణలతో స్థానికంగా కలకలం రేగింది. అయితే అక్కడి బీజేపీ నేతలతో ఉన్న వైరమే సురేంద్ర సింగ్ హత్యకు దారి తీసిందని ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ వెల్లడించారు.

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జరిగిన విబేధాలతో కొందరు ఆయనపై కక్ష పెంచుకున్నట్లు చెప్పారు. నిందితుల్లో ఒకరు సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నారని.. అయితే సురేంద్ర సింగ్ సదరు వ్యక్తికి సహకరించకుండా వేరే వ్యక్తికి సపోర్ట్ చేశాడనే క్రమంలో పగ పెంచుకుని హతమార్చినట్లు తెలిపారు.

 పంచాయతీ ఎన్నికల గొడవ.. సురేంద్ర సింగ్ హత్య

పంచాయతీ ఎన్నికల గొడవ.. సురేంద్ర సింగ్ హత్య

స్మృతి ఇరానీకి ప్రధాన అనుచరుడిగానే కాకుండా అత్యంత నమ్మకస్తుడిగా పేరు పొందిన సురేంద్ర సింగ్ చివరకు సొంత పార్టీ నేతల చేతిలో హతమవడం చర్చానీయాంశమైంది. అయితే సురేంద్ర సింగ్ అంత్యక్రియలకు హాజరైన సందర్భంలో మీడియాతో మాట్లాడిన స్మృతి ఇరానీ నిందితులకు శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు. సురేంద్ర సింగ్ కుటుంబ సభ్యుల పక్షాన నిలబడతానని చెప్పారు. అయితే ఆయనను హత్య చేసింది సొంత పార్టీ నేతలే అని తేలడంతో ఆమె నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
Shocking News came into limelight in the death case of BJP Leader Smriti Irani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X