వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్ తీసుకునే మందుబాబులకు షాకింగ్ న్యూస్ .. 45 రోజులు నో లిక్కర్ అంటున్న నిపుణులు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది . గత నాలుగు రోజులుగా మనదేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మొదటి ఆరోగ్య సిబ్బందికి, కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ కు వాక్సినేషన్ ఇచ్చిన తర్వాత, వృద్ధులకు, ఇతర అనారోగ్యాలతో బాధపడే వారికి, ఆ తర్వాత సామాన్యులకు వాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారికి నిపుణులు సలహా ఇస్తున్నారు.

Recommended Video

Covid Vaccination Drive : 100 Medical Health Workers Vaccinated In Nellore On Sunday

ఇండియాలో ఏడు నెలల కనిష్టానికి కరోనా కొత్త కేసులు ; 8 నెలల కనిష్టానికి మరణాలుఇండియాలో ఏడు నెలల కనిష్టానికి కరోనా కొత్త కేసులు ; 8 నెలల కనిష్టానికి మరణాలు

వ్యాక్సిన్ తీసుకునే వారు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండాలని నిపుణుల సూచన

వ్యాక్సిన్ తీసుకునే వారు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండాలని నిపుణుల సూచన

కోవిడ్ -19 కు టీకాలు వేయించుకోవాలని యోచిస్తున్న వారు 45 రోజుల పాటు తమను తాము సిద్ధం చేసుకోవాలని అంటున్నారు . కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్కహాల్ రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకునే వారందరూ కనీసం 45 రోజుల పాటు మద్యపానం చేయకుండా ఉండమని నిపుణులు సూచించారు.

వ్యాక్సిన్ పూర్తిగా పని చెయ్యాలంటే మద్యానికి దూరంగా ఉండాల్సిందే

వ్యాక్సిన్ పూర్తిగా పని చెయ్యాలంటే మద్యానికి దూరంగా ఉండాల్సిందే

జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ ఎంకె సుదర్శన్ జారీ చేసిన సలహా ప్రకారం, కోవిడ్ -19 వ్యాక్సిన్ నుండి పూర్తిగా ప్రయోజనం పొందటానికి, వ్యాక్సిన్ తీసుకున్నవారు వారి రోగనిరోధక వ్యవస్థ తగినంత యాంటీబాడీస్ ను అభివృద్ధి చేయటానికి మద్యానికి దూరంగా ఉండాలని చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోవిడ్ -19 వ్యాక్సిన్ల యొక్క రెండు షాట్లు 30 రోజుల వ్యవధిలో తీసుకోవలసి ఉంటుంది మరియు రెండవ షాట్ ఇచ్చిన రెండు వారాల తర్వాత మాత్రమే వైరస్ తో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థ యాంటీ బాడీస్ ను అభివృద్ధి చేస్తుంది.

వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా లిక్కర్ కు దూరంగా ఉంటేనే వ్యాక్సిన్ ప్రభావం

వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా లిక్కర్ కు దూరంగా ఉంటేనే వ్యాక్సిన్ ప్రభావం

మద్యం సేవించినట్లయితే వ్యాక్సిన్‌కు రోగనిరోధక ప్రతిస్పందన అడ్డు పడుతుందని, టీకాల యొక్క పూర్తి ప్రభావాన్ని మరియు ప్రయోజనాన్ని పొందడానికి మద్యానికి దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత డేటా ప్రకారం, రెండవ టీకా మోతాదు తర్వాత 14 రోజుల తరువాతనే యాంటీ బాడీస్ అభివృద్ధి చెందుతాయి. అందువల్ల 45 రోజులు మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది అని సుదర్శన్ స్పష్టం చేశారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం కొన్ని వారాలపాటు మద్యానికి దూరంగా ఉండటం మంచిదని, అప్పుడే వ్యాక్సిన్ సమర్ధంగా పని చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

మందుబాబులకు షాకింగ్ విషయం ..కరోనా నుండి కాపాడుకోవటానికి తప్పని తిప్పలు

మందుబాబులకు షాకింగ్ విషయం ..కరోనా నుండి కాపాడుకోవటానికి తప్పని తిప్పలు

భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు 3.8 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వారిలో 580 మందికి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించగా, ఏడుగురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. అయితే ఈ మరణాలు కరోనా ఈ వ్యాక్సిన్ వల్ల కాదని కేంద్రప్రభుత్వం నిర్ధారించింది. వ్యాక్సిన్ పై పలు అనుమానాలు, పలు సందేహాలు వ్యక్తం అవుతున్న సమయంలో మద్యపానం సేవించే వారు వ్యాక్సిన్ తీసుకుంటే మద్యానికి దూరంగా ఉండాలని, అప్పుడే వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని కీలకమైన సమాచారాన్ని అందించారు జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ ఎం కే సుదర్శన్.


ఇది మందుబాబులకు షాకింగ్ విషయమే అయినా కరోనా నుండి కాపాడుకోవటానికి తప్పదు మరి.

English summary
Those who are planning to get vaccinated against Covid-19 should prepare themselves for a 45-day sober streak. According to reports alcohol can adversely affect immune system and experts have advised all those taking the coronavirus jab to restrain from drinking for a few couple of weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X