వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ .. మహిళ కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకల బంతి, తొలగించిన నిర్మల్‌ జిల్లా వైద్యులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతున్న ఓ 22 ఏళ్ల మహిళ ఆస్పత్రికి వెళ్లగా ఆమె కడుపులో వెంట్రుకలు ఉన్నాయని ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో రెండున్నర కిలోల బంతిలా చుట్టిన వెంట్రుక బయటపడడంతో షాక్ తిన్నారు . కడుపులో నుంచి బయటపడిన ఈ వెంట్రుకల బంతి ప్రపంచంలోనే అతి పెద్దదని వైద్యులు భావిస్తున్నారు.

 నిర్మల్ జిల్లా కేంద్రంలో మహిళ కడుపులో వెంట్రుకల బంతి .. అనారోగ్యం

నిర్మల్ జిల్లా కేంద్రంలో మహిళ కడుపులో వెంట్రుకల బంతి .. అనారోగ్యం

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ మహిళకు గత 15 రోజులుగా ఏది తిన్నా వాంతులు కావడం, తరచూ కడుపునొప్పి రావడంతో ఆమె బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో కొద్ది రోజుల పాటు వైద్య చికిత్స అందించి తిరిగి ఇంటికి పంపించేశారు. అయినప్పటికీ మహిళ ఆరోగ్యం క్షీణించటంతో పాటుగా, అసలేమీ తినలేని పరిస్థితుల్లో మహిళను మరోమారు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఎండోస్కోపీ చేసి చూసిన వైద్యులు మహిళ చిన్న ప్రేవుల్లో వెంట్రుకలు ఉండడాన్ని గమనించారు.

 రెండున్నర కిలోల వెంట్రుకల బంతిని తొలగించిన వైద్యులు

రెండున్నర కిలోల వెంట్రుకల బంతిని తొలగించిన వైద్యులు

దీంతో ఆ మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో నుండి రెండున్నర కిలోల వెంట్రుకలను బయటకు తీశారు. కడుపులోకి ఇన్ని కిలోల వెంట్రుకలు ఎట్లా వచ్చాయని ఆరా తీసిన వైద్యులకు కుటుంబ సభ్యులు అసలు విషయాన్ని వెల్లడించారు. సదరు మహిళ మానసిక స్థితి బాలేదని, ఆమెకు వెంట్రుకలు పీక్కొని తినే అలవాటు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక ఆపరేషన్ చేసిన వైద్యులు రెండున్నర కిలోల వెంట్రుకల బంతిని తొలగించటం తో పాటుగా, ఆపరేషన్ సక్సెస్ అయిందని పేర్కొన్నారు.

కడుపులో నుంచి బయటకు తీసిన వెంట్రుకల బంతి ప్రపంచంలోనే అతి పెద్దది

కడుపులో నుంచి బయటకు తీసిన వెంట్రుకల బంతి ప్రపంచంలోనే అతి పెద్దది

వెంట్రుకల బంతి చుట్టూ 150 సెంటీమీటర్లు తోకలా జుట్టు పెరిగిందని, చిన్నతనం నుండి వెంట్రుకలు పీక్కుతినే అలవాటు ఉన్న కారణంగా ఆ వెంట్రుకలంతా ఒక బాల్ మాదిరిగా తయారై యువతి కడుపునొప్పికి కారణమయ్యాయని వైద్యులు వెల్లడించారు.


అయితే ఇలా వెంట్రుకలు బంతిలా మారటం అరుదైన ఘటన అని వెల్లడించారు . సహజంగా మతి స్థిమితం లేని వారికి వెంట్రుకలు పీక్కు తినే అలవాటు ఉంటుందని కానీ ఇంత భారీగా ఆపరేషన్ లో వెంట్రుకలు బయట పడటం ఇదే తొలిసారని వైద్యులు చెప్పారు. ఏది ఏమైనా మహిళ ప్రాణాలు కాపాడారు .

English summary
A shocking incident took place in the state of Telangana. A 22-year-old woman suffering from abdominal pain was rushed to a hospital where doctors said she had hair in her abdomen. Doctors believe that this hair ball that came out of the abdomen is the largest in the world. doctors removed 2 kgs 500 grams clump of hair in a surgery on a 22-year-old woman in nirmal district .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X