బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిత్యానందతో విదేశాలకు పారిపోయిన అక్కాచెల్లెలు, కోర్టుకు ఏం చెప్పారంటే ! చంపేస్తారని భయం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ అహమ్మదాబాద్: వివాదిత మత గురువు స్వామి నిత్యానందతో విదేశాలకు పారిపోయిన ఇద్దరు యువతులు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావడానికి నిరాకరించారు. తమను వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ చెయ్యడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అందుకు మీరు అనుమతి ఇవ్వాలని నిత్యానందతో విదేశాలకు పారిపోయిన అక్కాచెల్లెలు కోర్టుకు మనవి చేశారు. తమ అమ్మాయిలను నిత్యానంద, ఆయన శిష్యులు కలిసి కిడ్నాప్ చేశారని, వారికి తమకు అప్పగించాలని జనార్దన్ శర్మా హైకోర్టును ఆశ్రయించి అర్జీ సమర్పించారు.

ప్రేమ ముసుగులో సాటి ఉద్యోగిని శీలం దోచుకున్నాడు, రూ. లక్షలు తీసుకుని, చంపేస్తా, ఏం చేస్తావు ?ప్రేమ ముసుగులో సాటి ఉద్యోగిని శీలం దోచుకున్నాడు, రూ. లక్షలు తీసుకుని, చంపేస్తా, ఏం చేస్తావు ?

అక్కాచెల్లెలు కిడ్నాప్ ?

అక్కాచెల్లెలు కిడ్నాప్ ?

నిత్యానంద ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్న తమ కుమార్తెలను (అక్కాచెల్లెలు) బలవంతంగా నిర్భంధించారని, వారిని కిడ్నాప్ చేసి మమ్మల్ని కలవకుండా చేస్తున్నారని జనార్దన్ శర్మా దంపతులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. నిత్యానంద, ఆయన శిష్యులు తమ కుమార్తెలు లోపముద్ర, నందితాలను క్షేమంగా రక్షించి తమకు అప్పగించాలని మనవి చేస్తూ జనార్దన్ శర్మా దంపతులు గుజరాత్ హైకోర్టులో అర్జీ సమర్పించారు.

కిడ్నాప్ కేసులో ఎస్కేప్ !

కిడ్నాప్ కేసులో ఎస్కేప్ !

గుజరాత్ పోలీసులు నిత్యానంద, ఆయన శిష్యులు కొందరి మీద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఇదే కేసులో నిత్యానంద శిష్యులు ఇద్దరిని (యువతులు) గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఎక్కడ తనను అరెస్టు చేస్తారో అనే భయంతో నిత్యానంద నకిలి పాస్ పోర్టు తో దేశం విడిచి పరారైనాడు.

చంపేస్తారని యువతుల ఆందోళన !

చంపేస్తారని యువతుల ఆందోళన !

నిత్యానందతో పాటు విదేశాలకు పారిపోయిన యువతులు లోపముద్రా, నందితా తమను అమెరికా లేదా వెస్ట్ ఇండీస్ రాయభారి కార్యాలయాల నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ చెయ్యాలని, వ్యక్తిగతంగా తాము కోర్టు ముందు హాజరుకాలేమని, అందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానంకు మనవి చేశారు. తన తండ్రి, కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, అందుకే తాము వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకాలేకపోతున్నామని నిత్యానంద వెంట విదేశాలకు పారిపోయిన లోపముద్రా, నందితా కోర్టుకు సమాచారం ఇచ్చారు.

విదేశాల్లో యువతులు, క్లారిటీ !

విదేశాల్లో యువతులు, క్లారిటీ !

నకిలి పాస్ పోర్టు ఉపయోగించి నిత్యానంద విదేశాలకు పారిపోయాడని గుజరాత్ పోలీసులకు సమాచారం అందింది. విదేశాలకు పారిపోయిన నిత్యానంద ఈక్విడార్ లోని ఓ ద్వీపం సొంతంగా కొనుగోలు చేసి దానికి కైలాస దేశం అనే పేరు పెట్టారు.కైలాస అనే దేశం నిర్మించే పనిలో నిత్యానంద చాల బిజీగా ఉన్నారని ఆయన శిష్యులు అంటున్నారు.
అయితే నిత్యానంద ఎలాంటి దీవి కొనుగోలు చెయ్యలేదని ఈక్విడార్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

కిడ్నాప్ కేసులో నోటీసులు

కిడ్నాప్ కేసులో నోటీసులు

అమ్మాయిలను కిడ్నాప్ చేశారని ఆరోపణలు రావడంతో నిత్యానంద, ఆయన శిష్యులకు నోటీసులు జారీ చేసిన గుజరాత్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా లేదా వెస్ట్ ఇండీస్ రాయభార కార్యాలయాల నుంచి తమను వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ చెయ్యాలని జనార్దన్ శర్మ కుమార్తెలు లోపముద్రా, నందితా కోర్టుకు మనవి చెయ్యడంతో వారిద్దరూ నిత్యానంద విదేశాలకు పారిపోయారని వెలుగు చూసింది. అయితే నిత్యానంద, ఆయన శిష్యులు కొందర్ని అరెస్టు చెయ్యడానికి గుజరాత్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
New Delhi: In A Shocking Statement Followers of Nityananda Blamed there Parents, Girls From Nityananda Ashram Pleaded The Court Appear Through Video Conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X