వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ .. ప్రజా కోర్టు నిర్వహించి మరీ సొంత కమాండర్ ను హతమార్చిన మావోయిస్ట్ లు

|
Google Oneindia TeluguNews

చత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సొంత కమాండర్ ని హతమార్చిన సంఘటన చర్చనీయాంశంగా మారింది . బస్తర్ రేంజి ఐజి ఈ ఘటనను ధృవీకరిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఒకపక్క మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ దళాలు వేట సాగిస్తున్న వేళ మావోయిస్టులు సొంత పార్టీ కమాండర్ లానే హతమార్చటం గమనార్హం .

Police Alert: వాగు దాటుతూ డ్రోన్ కెమెరాలకు చిక్కిన మావోలు..ఇదిగో వీడియో..!Police Alert: వాగు దాటుతూ డ్రోన్ కెమెరాలకు చిక్కిన మావోలు..ఇదిగో వీడియో..!

బీజాపూర్ జిల్లా గంగులూరు ఏరియాలో ఈ మధ్య కాలంలో ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులను మావోయిస్టులు హత్యలు చేస్తున్నారనే వార్తలు వెలుగులోకి రావడంతో, మావోయిస్టు అగ్రనాయకత్వం దండకారణ్యం జోన్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. హత్య ఘటనల వెనుక పూర్వాపరాలు శోధించి ప్రజా కోర్టు నిర్వహించి అనంతరం స్థానిక డివిజన్ ఏరియా కమిటీ ఇంచార్జీ, కమాండర్ విజా మోడియం అలియాస్ బద్రును దోషిగా నిర్ధారించింది.

 shocking ... The Maoists killed their own commander

గ్రామస్తుల హత్యలు ఉద్దేశ్య పూర్వకంగా బద్రు ఏకపక్షంగా స్వంత నిర్ణయాలు తీసుకుని తనకు వ్యతిరేకంగా వున్న వారిని చంపాడనే అభియోగంతో మావోయిస్టులు తమ సొంత కమాండర్‌నే హతమార్చారు. మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా పేరు గాంచిన విజాను గంగులూరు మరియు కిరాండుల్ మధ్య ఎటావర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు హత్య చేసినట్లు సమాచారం. మావోయిస్టులు విజాను హతమార్చిన అనంతరం అర్ధరాత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా సమాచారం. సొంత గ్రామం మంకెలీలో మావోయిస్టు కమాండర్ విజా అంతక్రియలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది.

Recommended Video

Sonu Sood Helps A Tribal Girl In Chhatisgarh

అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మావోయిస్టు నాయకుడు, డివిసి ఇంచార్జ్ గంగులూరు ఏరియా కమిటీ విజా మోడియం అలియాస్ బద్రు వయసు 34 సంవత్సరాలు. అతను బీజాపూర్ జిల్లా గంగులూరు సమీపంలోని మంకెలి గ్రామస్థుడు. మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ సభ్యుడు .

English summary
The Maoist-led Dandakaranyam Zone has taken the incident seriously following reports that Maoists have been killing tribals in tribal areas in the Gangur area of ​​Bijapur district in recent times. Local Division Area Committee in-charge, Commander Viza Modiam alias Badru was later convicted after a public court conducted a search for the culprits behind the murder. The Maoists assassinated their own commander, accusing Badru of deliberately killing villagers and taking his own decisions and killing those who were against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X