వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలివైన దొంగలు: ఆ దుకాణం నుంచి ఈ దొంగలు ఏమి దోచుకెళ్లారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ : సాధారణంగా ఒక ఇంట్లోకి దొంగలు దూరారంటే ఏం దోచుకెళుతారు..? నగలో, డబ్బులో, ఇతర కాస్లీ వస్తువులో దోచుకెళుతారు. అదే దొంగలు దుకాణంలోకి చొరబడ్డారంటే ఏమి తీసుకెళుతారు.. క్యాష్ బాక్స్‌లో ఉన్న డబ్బులను మొత్తం లూటీ చేస్తారు. కానీ ఈ దొంగలు మాత్రం వెరైటీగా ఉన్నట్లున్నారు. డబ్బులు కాకుండా అంతకంటే విలువైనది దుకాణం నుంచి దోచుకెళ్లారు. ఇంతకీ ఈ దొంగలు ఏం చోరీ చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే .

ఉల్లి కష్టాలు: ఆ సంస్థ కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని వృథా చేసిందా..?ఉల్లి కష్టాలు: ఆ సంస్థ కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని వృథా చేసిందా..?

దుకాణంలో పడ్డ దొంగలు

దుకాణంలో పడ్డ దొంగలు

పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్‌లో ఉన్న సుతహతాలోని ఓ దుకాణంలో దొంగలు పడ్డారు. దుకాణంలో అంతా సోదించారు. ఆ దుకాణంలో అన్ని ఐటెమ్స్‌ను చిందరవందరగా పడేశారు. వెళుతూ వెళుతూ ఓ బస్తా తీసుకెళ్లారు. ఆ బస్తాలో వస్తువులు డబ్బులు ఉన్నాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

 డబ్బులను ముట్టని దొంగలు

డబ్బులను ముట్టని దొంగలు

మంగళవారం ఉదయం షాపు యజమాని తన దుకాణంను తెరవగానే వస్తువులన్నీ చిందరవందరగా పడటం గమనించాడు. వెంటనే తన షాపులో దొంగతనం జరిగి ఉంటుందని భావించి క్యాష్ బాక్స్ దగ్గరకు వెళ్లి చూడగా తాను ముందురోజు దుకాణంను కట్టేస్తున్నప్పుడు ఎంత డబ్బులు అయితే ఉన్నిందో ఆ డబ్బులు అలానే ఉంది. మరి ఏం దొంగతనం చేశారా అని షాపు మొత్తాన్ని పరిశీలించగా దొంగలు ఏమి దోచుకెళ్లారో అప్పుడు తెలిసింది.

 ఉల్లిపాయలను దోచుకెళ్లిన దొంగలు

ఉల్లిపాయలను దోచుకెళ్లిన దొంగలు

ఇంతకీ దొంగలు ఏమి దోచుకెళ్లారో తెలుసా.. ఉల్లిపాయలు. అవును క్యాష్ బాక్స్‌లో ఒక్క పైసా ముట్టని దొంగలు ఉల్లిపాయల బస్తాలను దోచుకెళ్లారు. వాటి విలువ రూ. 50వేలు ఉంటుంది. ప్రస్తుతం ఉల్లి ధరలు ఎలా మండిపోతున్నాయో చూస్తున్నాం. కొనకుండానే వాటి ధరలను విని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

రూ. 100 మార్క్‌ను తాకిని కిలో ఉల్లి

రూ. 100 మార్క్‌ను తాకిని కిలో ఉల్లి

ఉల్లిపాయలను అత్యంత పొదుపుగా వాడుతూ వాటిని బీరువాల్లో దాస్తున్న వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. సీన్ కట్ చేస్తే దుకాణం నుంచి ఉల్లిపాయలతో పాటు కొన్ని అల్లంవెల్లుల్లి కూడా దొంగలు తీసుకెళ్లినట్లు షాపు యజమాని చెప్పారు. ఒక్క పైసా కూడా క్యాష్ బాక్స్ నుంచి తీసుకోలేదని యజమాని చెప్పాడు. మొత్తానికి ఉల్లిపాయల ధరలు పెరిగిపోవడంతో ఏకంగా వాటిని చోరీ చేసేందుకు కొన్ని గ్యాంగులు తిరుగుతున్నట్లు సమాచారం. దుకాణాదారులు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లిపాయల ధర రూ.100 మార్క్‌ను టచ్ చేసింది.

English summary
A vegetable shop was looted by thieves in West Bengal where they took sacks containing Onions. As the Onions price touch Rs.100 a kilo, the burgulars did not touch a single penny from the cash box.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X