వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ్ మాల్యాకు షాక్ ఇచ్చిన యూకే హైకోర్టు .. మాల్యా పిటీషన్ కొట్టివేత

|
Google Oneindia TeluguNews

Recommended Video

మాల్యాకు షాక్ ఇచ్చిన యూకే హైకోర్టు... ఇక భరత్ కే ! || Oneindia Telugu

భారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు కింగ్‌ఫిషర్‌ మాజీ యజమాని విజయ్‌ మాల్యాకు యూకే న్యాయస్థానం షాక్ ఇచ్చింది .గత సంవత్సరం డిసెంబర్ 9న విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన యూకే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు . అయితే మాల్యా వేసిన పిటీషన్ ను కోర్టు సోమవారం నాడు కొట్టి వేసింది. దీంతో మాల్యాకు పెద్ద షాక్ ఇచ్చింది యూకే హైకోర్టు .

డిసెంబర్‌ 9న మాల్యాను ఇండియాకు అప్పగించాలని తీర్పు

డిసెంబర్‌ 9న మాల్యాను ఇండియాకు అప్పగించాలని తీర్పు

భారత్ లోని బ్యాంకులకు చెల్లించాల్సిన 9వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయి దర్జాగా బ్రతుకుతున్న మాల్యా అక్కడ చట్టాలలో ఉన్న లొసుగులను బట్టి లండన్ లో దర్జాగా బ్రతకొచ్చు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా యూకే కోర్టు మాల్యాను భారత్ కు అప్పగించాలని తీర్పు వెల్లడించింది .గతేడాది డిసెంబర్‌ 9న మెజిస్ట్రేట్ కోర్టు విజయ్‌ మాల్యాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ కోర్టు న్యాయమూర్తి ఎమ్మా ఆర్బుత్నాట్‌ మాల్యా కేసుపై తీర్పునిస్తూ ఇండియాలోని బ్యాంకులకు మాల్యా సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తిగా తేల్చిచెప్పింది.

తీర్పుపై మాల్యా పిటీషన్ దాఖలు .. మాల్యా పిటీషన్ కొట్టివేత

తీర్పుపై మాల్యా పిటీషన్ దాఖలు .. మాల్యా పిటీషన్ కొట్టివేత

భారత్‌లోని ఆర్ధిక నేరగాళ్ళ జాబితాలో ఉన్న విజయ్ మాల్యాను ఎలాగైనా భారత్ కు రప్పించాలని భారత్ తీవ్ర యత్నాలు చేసింది. పలు బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాను భారత్‌కు అప్పగించడానికి ఇంగ్లాండ్‌ హోం సెక్రటరీ సాజిద్ జావిద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపారు. దీనికి వ్యతిరేకంగా వెస్ట్ మినిస్టర్ కోర్టులో మాల్యా పిటిషన్‌ దాఖలు చేశాడు.అయితే ఆ పిటీషన్ కోర్టు కొట్టివేయటంతో మాల్యాను భారత్ కు అప్పగించనున్నారు .

మాల్యాకు పై కోర్టులో అప్పీల్ చేసుకునే ఒకే ఒక ఆప్షన్

మాల్యాకు పై కోర్టులో అప్పీల్ చేసుకునే ఒకే ఒక ఆప్షన్

ఇక ఈ వ్యవహారంలో తదుపరి వాదనలు జరగనున్నాయి. దీంతో ఆయన పై కోర్టుకు అప్పీల్‌ చేసుకునే అవకాశం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ మొత్తం తంతు పూర్తి కావడానికి కనీసం ఆరు వారాలైనా పట్టవచ్చు. మాల్యా భారత్ కు రాకుండా ఉండటం కోసం విఫల యత్నాలు చేస్తున్నారు. ఒకపక్క భారత ప్రభుత్వం మాల్యాను ఇండియాకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తోంది.

English summary
The UK High Court denied Vijay Mallya permission to appeal against his extradition order to India, marking the further dwindling of his legal options. While refusing the application, Justice William Davis gave Mallya a five-day period to apply for oral consideration. However, there will be no further legal recourse available in terms of the appeal process if this is also rejected, experts said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X