చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

9మంది పెళ్లి ఆగింది: వరదతో కాదు..జయలలిత కోసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆదివారం నాడు చెన్నైలో తొమ్మిది పెళ్లిళ్లు రద్దయ్యాయి. ఇటీవల చెన్నైని భారీ వర్షాలు, భారీ వరదలు కుదిపేసిన విషయం తెలిసిందే. చెన్నై వరదలతో అతలాకుతలమైన నేపథ్యంలో ఈ పెళ్లిళ్లు రద్దయ్యాయనుకుంటే పొరపాటే! ఆ పెళ్లిళ్లు రద్దయింది ముఖ్యమంత్రి జయలలిత కోసం.

జయలలిత కోసం పెళ్లి రద్దు చేసుకోవడాన్ని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇది నిజం. ఆ తొమ్మిది పెళ్లిళ్లు కూడా జయలలిత కోసం రద్దయ్యాయి. దీనికి కారణం ఉంది. ఈ పెళ్లిళ్లకు ముఖ్యమంత్రి జయలలిత ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది.

షన్ముగనాథన్ కూతురు తమిఝరాసి పెళ్లి జరగాల్సి ఉంది. ఆమెకు నితిన్‌తో ఆదివారం నాడు పెళ్లి నిర్ణయించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు... ఇద్దరూ వైద్యులే. ఇక షన్ముగనాథన్ తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి.

Shocking: When 9 marriages were cancelled not for Chennai Flood but for Jayalalithaa

సమాచారం మేరకు అదే సమయానికి అక్కడ తొమ్మిది పెళ్లిళ్లు ఉన్నాయి. అవి జయలలిత ఆశీర్వాదంతో జరగాల్సి ఉంది.

సదరు పర్యాటక శాఖ మంత్రి అంతకుముందే తన కూతురుకు పెళ్లి తేదీ నిర్ణయించాలనుకున్నప్పటికీ.... జయలలిత జైల్లో ఉండటంతో వాయిదా వేశారు. అ తర్వాత ఆమె బయటకు వచ్చాక మళ్లీ తేదీని నిర్ణయించారు. కానీ ఇప్పుడు చెన్నైలో భారీ వరదల కారణంగా మళ్లీ పెళ్లి రద్దయింది.

English summary
At least nine marriages have been cancelled in Chennai on Sunday, Dec 6. Many might be thinking that the marriages got cancelled due to some family complications or because of the incessant rains and massive flood which has hit the city and other parts of Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X