వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌కు చేదు అనుభవం: బూటు విసిరిన వ్య‌క్తి అరెస్ట్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం మందస్తు ప్రచారానికి దిగిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్త‌రప్ర‌దేశ్‌లోని సీతాపూర్‌లో ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ గాంధీపైకి ఓ స్థానికుడు బూటు విసిరాడు. అయితే ఈ బూటు దాడి నుంచి రాహుల్ తృటిలో తప్పించుకున్నాడు.

Shoe Thrown

ఓపెన్ టాప్ జీపులో వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. జీపులో రాహుల్ ముందు కూర్చొని ఉండగా, స్థానికుడు విసిరిన బూటు రాహుల్ వెనుకనే ఉన్న వ్యక్తి చేతిని తాకింది. త‌న‌వైపు బూటు విస‌ర‌డాన్ని రాహుల్‌గాంధీ గ‌మ‌నించారు. దీంతో పక్కనే ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇంతలో జీపు పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూటు విసిరిన వ్యక్తిపై దాడి చేసేందుకు యత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అనంత‌రం మ‌ళ్లీ రాహుల్ గాంధీ త‌న రోడ్ షోను కొన‌సాగించారు. కాగా షూ విసిరిన వ్యక్తి జర్నలిస్ట్ అనూప్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. కాగా వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ రాష్ట్రవ్యాప్తంగా కిసాన్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

English summary
A shoe was thrown at Rahul Gandhi on Monday during his roadshow in Uttar Pradesh. The shoe missed the Congress leader narrowly but the attacker was arrested. Mr Gandhi was riding in an open top vehicle on a prominent Sitapur, around 85 km from Lucknow, when a shoe came flying at him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X