వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెహెల్కా లైంగిక దాడి కేసు: షోమా చౌధురి రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెహెల్కా లైంగిక దాడి కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి రాజీనామా చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దూకుడుకు పేరు మోసిన జర్నిలిజానికి పేరు పడిన తెహెల్కా గతవారం తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం షోమా చౌధరిని కూడా చుట్టుకుంది.

వివాదం వెలుగులోకి రాగానే షోమా చౌధరి మహిళా జర్నలిస్టుకు మద్దతుగా తేజ్‌పాల్‌పై లైంగిక దాడికి సంబంధించి ఫిర్యాదు చేశారు. అయితే, లైంగిక దాడికి గురైనట్లు భావిస్తున్న మహిళా జర్నలిస్టు తెహెల్కాకు రాజీనామా చేస్తూ షోమా చౌధరిపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. షోమా చౌధరి తనను బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారని, తనపై అభాండాలు వేస్తున్నారని మహిళా జర్నలిస్టు షోమా చౌధరిపై ఆరోపణలు చేశారు.

Shoma Chaudhury

ఇదిలావుంటే, లైంగిక దాడి కేసులో మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో తమ ముందు హాజరు కావాలని గోవా పోలీసులు నిందితుడైన తెహెల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు సమన్లు జారీ చేశారు. గురువారం 3 గంటలకు తమ ముందు హాజరు కావాలని వారు సమన్లు జారీ చేశారు.

తేజ్‌పాల్‌కు ఆ మేరకు మెయిల్ చేశామని, ఫోన్ చేసి కూడా చెప్పామన డిఐడి ఓపి మిశ్రా మీడియా ప్రతినిధులకు చెప్పారు. తేజ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

English summary

 The managing editor of Tehelka, Shoma Chaudhury has tendered her resignation.The past week has witnessed the biggest controversy to hit Tehelka magazine, which is primarily known for its hard-hitting journalism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X