వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్ అంటే ఇదే: భారత్-పాక్ సరికొత్త యుద్ధం

పెద్ద నోట్ల రద్దుతో డాలర్ల కొరత ఎక్కువ అయ్యింది. పాక్ దౌత్యాధికారులు ఐదు డాలర్ల కంటే ఎక్కువ డ్రా చెయ్యడానికి వీలు లేదని, అంతకంటే ఎక్కువ డాలర్లు డ్రా చెయ్యాలంటే సరైన వివరాలు ఇవ్వాలని నియమాలు పెట్టారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ కు చుక్కలు చూపించే సమయం వచ్చింది. ఇత కాలం దొంగచాటుగా ఉగ్రవాదులతో భారత్ లోకి ప్రవేశించి దాడులు చేయిస్తున్న పాక్ ప్రభుత్వానికి ప్రధాని మోడీ ప్రభుత్వం పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ దెబ్బతో పాక్ దౌత్యాధికారుల దిమ్మతిరిగింది.

భారత్- పాక్ మధ్య సరికొత్త యుద్ధానికి ఇప్పుడు తెరలేచింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో పాక్ హైకమిషన్ దౌత్యాధికారుల పైన తీవ్ర ప్రభావం పడింది. డాలర్ల కొరత నేపథ్యంలో పాక్ దౌత్యాధికారులకు భారత్ బ్యాంకులు పరిమితులు విధించాయి.

Shortage of dollars sparks diplomatic war between India and Pak

పాక్ దౌత్యాధికారులు డాలర్లకు పన్ను లేకుండా ఇంతకాలం జీతాలు తీసుకునే వెసులుబాటు ఉండేది. అయితే భారత్ లో ఇప్పుడు ఐదు వేల డాలర్లకు మించి విత్ డ్రా చేయాలంటే అందుకు కచ్చితంగా కారణాలు చూపిస్తూ వాటికి సంబంధించిన ప్రతాలు సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఐదు డాలర్ల కంటే తక్కువ విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో డాలర్ల కొరత ఎక్కువగా ఉంది. పాక్ హైకమిషన్ ఉద్యోగులు జీతాల ఖతాలు ఆర్ బీఎల్ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి.

Shortage of dollars sparks diplomatic war between India and Pak

బ్యాంకులో ఎన్ని డాలర్లు విత్ డ్రా చేయాలన్నా అందుకు సరైన పత్రాలు సమర్పించాలని ఆర్ బీఎల్ బీ బ్యాంకు స్పష్టం చేసింది. లేదంటే ఎక్సేంజ్ రుసుము చెల్లించి భారత కరెన్సీలో జీతాలు తీసుకోవాలని సూచించింది.

ఇలా ఎక్సేంజ్ పద్దతిలో తీసుకోవాలన్నా కచ్చితంగా రిజర్వు బ్యాంకు నియమాలు పాటించాలని పాక్ దౌత్యాఅధికారులకు తేల్చి చెప్పింది. అలా కూడా కాకుంటే మీ డబ్బును పాక్ కు తరిగి పంపించుకోవాలని సూచించింది.

Shortage of dollars sparks diplomatic war between India and Pak

ఈషరతులతో పాక్ దౌత్యాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా చెయ్యడం ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అంటున్నారు. మా దేశంలో ఉన్న భారత దౌత్యాధికారులకు ఇలాంటి నియమాలే పెడుతామని సవాలు చేస్తున్నారు.

మాజీతాల చెల్లింపులో ఇలాంటి నియమాలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, ఇటీవల పాక్-భారతదేశాల మధ్య నెలకోన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే మమ్మల్ని లక్షంగా చేసుకుని ఇలా ఇబ్బంది పెడుతున్నారని, అందుకు పెద్ద నోట్లు రద్దు ప్రభావం ఏమాత్రం లేదని పాక్ దౌత్యాధికారులు ఆరోపిస్తున్నారు.

Shortage of dollars sparks diplomatic war between India and Pak

అయితే ఈ విషయంలో సమస్యలు పరిష్కరించడానికి సంబంధిత సంస్థలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ అధికారులు అంటున్నారు. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దు ప్రభావం పాక్ దౌత్యాధికారుల మీద కచ్చితంగా పడుతుందని ఆర్థిక శాఖ నిపుణులు అంటున్నారు.

English summary
Pakistan has now threatened to do the same with Indian diplomats and officials in Islamabad if the MEA doesn't get the bank to remove the new conditions immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X