• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భార‌త్‌- యుకే అవార్డుల 2019 జాబితా సిద్ధం

|

వాణిజ్య, సాంకేతిక‌, వ్యాపార‌, సామాజిక అంశాల్లో భార‌త్‌, యునైటెడ్ కింగ్‌డ‌మ్ దేశాల మ‌ధ్య నెల‌కొన్న సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా భార‌త్‌-యుకె అవార్డులు 2019ను ప్ర‌క‌టించారు. ఈ అవార్డులను ఎంపిక చేయ‌డానికి రూత్ డేవిడ్‌స‌న్‌, జీనా మిల్ల‌ర్‌, షాలినీ అరోరా న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. యూకే బ్రెగ్జిట్‌లో కొన‌సాగాలా? వ‌ద్దా?, ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాల‌ను పెంపొందించుకోవ‌డంలో భార‌త్ పాత్ర వంటి అంశాల‌పై ఈ అవార్డుల‌ను అంద‌జేస్తారు.

ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ కార్పొరేష‌న్ సంస్థ ఈ అవార్డుల‌ను తుది జాబితాను ప్ర‌క‌టించింది. ఇండియా-యుకె వారోత్స‌వాలు (జూన్ 24 నుంచి 28వ తేదీ వ‌రకు) కార్య‌క్ర‌మంలో భాగంగా- ఈ జాబితాను వెల్ల‌డించారు. యుకేలో కొన‌సాగుతున్న 842 భార‌తీయ సంస్థ‌ల ప్ర‌తినిధులు ఈ కార్య‌క్రమానికి హాజ‌ర‌య్యారు. గ్రాంట్ థార్న‌ట‌న్ నివేదిక ప్ర‌కారం.. ఈ 842 సంస్థ‌లు మొత్తం 48 బిలియ‌న్ యూరోల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. గ‌తంలో ఆయా సంస్థ‌ల ఆదాయం 46.4 బిలియ‌న్ యూరోలు ఉండ‌గా.. ఆ మొత్తం 48 బిలియ‌న్ యూరోల‌కు చేరుకుంది. ఓఎన్ఎస్ అంచ‌నాల ప్ర‌కారం.. గ‌త ఏడాది భార‌త్ నుంచి యుకేకు వ‌చ్చిన పెట్టుబ‌డుల్లో 321 శాతం పెరుగుద‌ల న‌మోదైంది.

ఆయా పెట్టుబ‌డుల‌న్నింటికీ లండ‌న్ కేంద్ర బిందువైంది. యూర‌ప్‌లోని మిగిలిన న‌గ‌రాల‌తో పోల్చుకుంటే ఒక్క లండ‌న్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి భార‌తీయ సంస్థ‌లు ఆసక్తి చూపుతున్నాయి. యూకె బ్రెగ్జిట్‌లో కొన‌సాగినా, కొన‌సాగ‌క పోయినా భార‌త్ నుంచి వ‌చ్చే పెట్టుబ‌డుల‌పై మాత్రం ఎలాంటి దుష్ప్ర‌భావాన్ని చూప‌ట్లేదు. భార‌తీయ సంస్థ‌ల పెట్టుబ‌డులు య‌థాత‌థంగా కొన‌సాగుతూనే ఉన్నాయి.

Shortlist of UK-India Awards 2019 announced

కాగా యూకే-ఇండియా అవార్డుల న్యాయ నిర్ణేత‌ల ప్యానెల్‌లో అంద‌రూ మ‌హిళ‌లే కావ‌డం విశేషం. వ్యాపారం, సాంకేతిక రంగం, మీడియా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన మ‌హిళా ప్ర‌తినిధులు ఇందులో న్యాయ నిర్ణేత‌లుగా ఉన్నారు. స్కాటిష్ క‌న్జ‌ర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ రూత్ డేవిడ్ స‌న్‌, శివ‌ణ్ణ విస్డ‌మ్ సీఈఓ షాలినీ అరోరా, రోల్స్ రాయిస్ జ‌న‌ర‌ల్ కౌన్సిల్ డైరెక్ట‌ర్ డెబోరా డీ అవుబ్నే, యూకే మాజీ మంత్రి ప్యాట్రీషియా హెవిట్‌, ట్రూ అండ్ ఫెయిర్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు జీనా మిల్లర్‌, నైకా డాట్ కామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు ఫ‌ల్గుణి నాయ‌ర్ ఈ ప్యానెల్‌లో న్యాయ నిర్ణేత‌లుగా ఉన్నారు.

ఈ ఏడాది మొత్తం 35 సంస్థల‌తో అవార్డుల కోసం తుది జాబితాను ప్ర‌క‌టించారు. జాన్ లెవిస్ ఫౌండేష‌న్ ఫ‌ర్ సోష‌ల్ ఇంపాక్ట్‌...

వాణిజ్యం, పెట్టుబ‌డుల ప‌దోన్న‌తుల ఏజెన్సీ టెక్ యుకే ...

స్టార్ట‌ప్ సంస్థ బ‌ఫెల్ గ్రిడ్‌...

న్యాయ సేవ‌ల‌ను అందించే బాక‌ర్ మెకెన్జీ...

సాఫ్ట్‌బ్యాంక్ విజ‌న్ ఫండ్‌..

కన్సల్టెన్సీ విభాగంల పీడబ్ల్యూసీ... వంటి సంస్థల ఉన్నాయి.

ఈ ఏడాది శిశు సంక్షేమం, అభివృద్ధి రంగంలో సేవలను అందిస్తోన్న బ్రిటీష్ ఆసియన్ ట్రస్ట్ సంస్థ భారత్-యుకే అవార్డులు 2019లో భాగస్వామ్యమైంది.

గత ఏడాది కార్బన్ క్లీన్ సొల్యూషన్స్, స్టాండర్డ్ ఛార్డెర్డ్ బ్యాంక్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇందులో పాల్గొన్నాయి.

బ్రిటీష్-ఇండియన్ పారిశ్రామికవేత్త, రాజకీయ వ్యూహకర్త, ఇండియా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మనోజ్ లాడ్వా మాట్లాడుతూ భారత్-యుకే మధ్య వ్యాపార, వాణిజ్య, సాంకేతిక రంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థల సేవలను గుర్తించి తాము ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహపూరక, సాంకేతిక పరమైన సంబంధాలను సుధృడం చేయడానికి ఈ అవార్డులు ఉపయోగపడతాయని అన్నారు. ఈ ఏడాది అవార్డుల నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని చెప్పారు. యుకే-ఇండియా మధ్య నెలకొన్న సంబంధాలను మరింత పటిష్ట పరిచే సంస్థలు, వ్యక్తులకు ఎప్పట్లాగే అవార్డులను అందజేస్తామని తెలిపారు. అవార్డు గ్రహీతలు పేర్లు, ఇతర వివరాలను జూన్ 28వ తేదీన లండన్ లో అత్యంత వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రకటిస్తామని అన్నారు. మరిన్ని వివరాలకు అమీ షా + 44 20 7199 6411, ukindiaweek@wearesevenhills.com ను సంప్రదించాలని ఆయన సూచించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The UK-India Awards 2019, an exclusive event celebrating the UK-India partnership is back in its third year, promising another glamorous evening celebrating special and significant talent. And now, they have announced the shortlist for this year's UK-India Awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more