వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేనత్తపై కాల్పులు, భూమి కోసం తెగబడ్డ మైనర్, ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పీఎస్‌కు బాధితురాలు..

|
Google Oneindia TeluguNews

రక్తం పంచుకొని పుట్టిన వాడే రాబందువులా మారాడు. భూమి కోసం సోదరి అని కూడా కనికరించలేదు. ఇక అతని కుమారుడు.. పదో తరగతి చదువుతున్న మైనర్ మేనత్త అనే జాలి, దయ కూడా చూపించలేదు. భూమి కోసం తన అత్తపై కాల్పులకు తెగబడ్డాడు. పంజాబ్‌లో జరిగిన ఘటన కలకలం రేపింది. భూ వివాదం నేపథ్యంలో తండ్రీ కొడుకులు భౌతిక దాడులకు తెగబడ్డారు.

 భూ వివాదం..

భూ వివాదం..

ముక్త్‌సర్ జిల్లాలో సుమిత్ కౌర్ (42) అనే వివాహిత ఉంటున్నారు. ఆమె తల్లి సుఖ్‌బిందర్ కౌర్ కూడా ఆమె వద్ద ఆశ్రయం పొందుతున్నారు. అయితే సుమిత్ కౌర్‌కు ఆమె తండ్రి 16 ఎకరాల భూమి ఇచ్చారు. ఈ భూమిపై ఆమె సోదరుడి హరిందర్ సింగ్ కన్నుపడింది. ఆమె నుంచి ఎప్పుడెప్పుడు భూమి లాక్కుందమా అని చూస్తున్నాడు.

కాల్పుల కలకలం..

కాల్పుల కలకలం..

గత శుక్రవారం సుమిత్ కౌర్.. అన్న కుమారుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. భూమి కోసం తన అత్తపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. మూడురౌండ్ల కాల్పులు జరిపాడు. అడ్డొచ్చిన నానమ్మ అని కూడా దయ చూపలేదు. అత్త తల, మొహంపై కాల్పులు జరపడంతో రక్తం ధారగా కారుతోంది. మేనల్లుడి నుంచి ఎలాగోలా తప్పించుకొన్న సుమిత్ కౌర్, సుఖ్‌బిందర్ కౌర్.. ఘటన గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్ వచ్చారు. అయితే వారిద్దరూ ఏడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లడం విశేషం.

ఇదీ విషయం..

ఇదీ విషయం..

సుమిత్ కౌర్ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్చారు. తల, మొహంపై ఉన్న ఉన్న బుల్లెట్లను వైద్యులు తీసివేశారు. తన సోదరుడు హరిందర్ సింగ్ భూమి తీసుకొనేందుకు దాడి చేశారని సుమిత్ కౌర్ తెలిపారు. తన తండ్రి చనిపోయాక ఆ భూమిని తన తల్లితోపాటు తనకు ఇచ్చారనే గుర్తుచేశారు. దానిని ఎలాగైనా కబ్జా చేయాలని భావిస్తోన్న హరిందర్ సింగ్.. తమపై దాడి చేశారని వాపోయారు.

గతంలో కూడా..

గతంలో కూడా..

ఇప్పుడే కాదు గతంలో కూడా దాడి చేశారని పోలీసులకు వివరించారు. కాల్పులకు సంబంధించి హరిందర్ సింగ్, అతని కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి, మహిళలకు తగిన భద్రత కల్పిస్తామని పోలీసులు స్పష్టంచేశారు.

English summary
42-year-old woman drove seven kilometres to a police station in Punjab to register a complaint against her brother and nephew in a land grab case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X