వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ మెడకు బాంబు కట్టి...

|
Google Oneindia TeluguNews

ఎన్నికల సమయం కావడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె కామెంట్లపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేరళలో హాట్ సీట్లు ఇవే: దేశం దృష్టి ఈ స్థానాలపైనే..!కేరళలో హాట్ సీట్లు ఇవే: దేశం దృష్టి ఈ స్థానాలపైనే..!

రాహుల్ మెడకు బాంబు కట్టి

రాహుల్ మెడకు బాంబు కట్టి

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాల్నాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడిన పంకజ.. బాలాకోట్ దాడులపై అనుమానం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
రాహుల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మెడకు బాంబు చుట్టి దేశం బయటకు విసిరేయాలని అన్నారు.

ప్రచారం కోసం పాకులాట

ప్రచారం కోసం పాకులాట

దేశాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ ఆ విషయాన్ని కూడా ప్రశ్నిస్తోందని పంకజ ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి ఆధారాలివ్వమని కాంగ్రెస్ అడగటం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రచారం కోసమే కాంగ్రెస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని పంకజ ముండే మండిపడ్డారు.

పంకజ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం

పంకజ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం

రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంకజా ముండేపై మహారాష్ట్ర కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ మెడకు బాంబు చుట్టి దేశం బయటకు విసరేయాలన్న వ్యాఖ్యలు బీజేపీ నేతల చవకబారుతనానికి నిదర్శనమని విమర్శించింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కర్కరే లాంటి అమరులను కించపరిచేలా మాట్లాడిన బీజేపీ నేతలు ఎంతకైనా దిగుజారుతారని కాంగ్రెస్ చురకలంటించింది.

English summary
BJP leader Pankaja Munde took the political discourse down a further notch, suggesting that those sceptical about the surgical strikes conducted by the army would be convinced only if the explosives were strapped onto Congress chief Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X