వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ని దోమలు చనిపోయాయో లెక్కిస్తానా?: విపక్షాలకు వీకే సింగ్, డిగ్గీరాజాపై ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో చేసిన దాడిలో వందలాదిమంది తీవ్రవాదులు హతమయ్యారని భావిస్తున్నారు. ఉగ్రవాద క్యాంపుపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో మృతులు చాలామంది ఉంటారని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా దాడికి ముందు ఆ ప్రాంతంలో 250 నుంచి 300 మొబైల్స్ వరకు పని చేశాయి.

ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత అవి పని చేయలేదు. దీంతో దాదాపు అంతమంది తీవ్రవాదులు చనిపోయినట్లుగా భావిస్తున్నారు. కానీ విపక్షాలు పదేపదే ఎయిర్ ఫోర్స్‌ను అవమానించేలా ఈ దాడులపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి. విపక్షాలపై కేంద్రమంత్రి వికే సింగ్ తాజాగా మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో మండిపడ్డారు.

అందుకే పాక్ అలా చేసి ఉండొచ్చు: మసూద్ కొడుకు, సోదరుడి అరెస్టుపై భారత్ అనుమానంఅందుకే పాక్ అలా చేసి ఉండొచ్చు: మసూద్ కొడుకు, సోదరుడి అరెస్టుపై భారత్ అనుమానం

 ఇంట్లోని దోమల్ని చంపేందుకు హిట్ వాడుతాను

ఇంట్లోని దోమల్ని చంపేందుకు హిట్ వాడుతాను

నేను ఇంట్లోని దోమలను చంపేసేందుకు హిట్ (HIT)ను వాడుతానని, ఆ తర్వాత నేను ఎన్ని చంపానో లెక్కించుకుంటు కూర్చుంటానా లేక ఆ తర్వాత హాయిగా నిద్రపోతానా అని ట్విట్టర్‌లో విపక్షాలను ఎద్దేవా చేశారు. దాదాపు 250 మంది తీవ్రవాదులు చనిపోయినట్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు మాత్రం ఎంతమంది చనిపోయారో చెప్పాలని నిలదీస్తున్నాయి. దీంతో వీకే సింగ్ ఇలా కౌంటర్ ఇచ్చారు.

 దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై ఆగ్రహం

దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై ఆగ్రహం

మరోవైపు, పుల్వామా ఉగ్రవాద దాడిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సహా పలువురు నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రవాద దాడి కాదని, ప్రమాదమని డిగ్గీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎయిర్ స్ట్రైక్ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై వీకే సింగ్ వేరుగా మండిపడ్డారు.

రాజీవ్ గాంధీది హత్యనా, ప్రమాదమా, ఉగ్రవాద ఘటనా?

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీది హత్యా లేక ప్రమాదమా లేక ఉగ్రవాద ఘటనా అని కూడా వీకే సింగ్ నిప్పులు చెరిగారు. బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ దాడిలో ఎంతమంది చనిపోయి ఉంటారని విలేకరులు ప్రశ్నించారు. దానికి వీకే సింగ్ స్పందిస్తూ... బాలాకోట్‌ దాడిలో రెండు వందల యాభై మంది ఉగ్రవాదులు హతమయ్యారని, పాకిస్థాన్‌లోని సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా నివాస ప్రాంతాలకు దూరంగా ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని మెరుపు దాడులు చేసినట్లు తెలిపారు.

English summary
In a jibe against the Opposition for repeatedly demanding the casualty figures in Balakot air strike, Union Minister General VK Singh Wednesday used an analogy of killing mosquitoes to drive his point home. On Twitter, using hashtag ‘generally saying,’ VK Singh wrote there were a lot of mosquitoes at 3.30 am in the night. “I used HIT (mosquito repellent) to kill them. Do I now count the number of mosquitoes killed or sleep comfortably,” the former Army chief, wrote in Hindi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X